దళారులకు ‘తుపాను’ మేలు
ఇబ్బందులు పడుతున్నాం
● మధ్యవర్తులకు కలిసొచ్చిన తుపాను
● తప్పని పరిస్థితుల్లో దళారులకు
ధాన్యాన్ని విక్రయిస్తున్న రైతులు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): రైతులను ఆగం చేసిన తుపాను దళారులకు మేలు చేసింది! చేతికొచ్చిన పంటను నూర్పిడి చేసే దశలో కురిసిన వర్షాలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరోవైపు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయిద్దామంటే అధికారులు ఇప్పటికీ కనీస వసతులు కల్పించకపోవడంతో రైతులు అయోమయస్థితిలో పడుతున్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం, ప్రారంభమైన కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు లేకపోవడంతో రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. కొందరు రైతులు వరి, మొక్కజొన్న, సోయా తదితర పంటలను దళారులకే విక్రయిస్తున్నారు. ఇదే అదనుగా భావించిన దళారులు ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం క్వింటాల్ మొక్కజొన్నకు రూ.2400 ధర ప్రకటించగా దళారులు రూ.1600 నుంచి రూ.1900 చెల్లిస్తున్నారు. సోయాకు మార్కెట్ ధర రూ.5,328 ఉండగా దళారులు రూ.4 వేల నుంచి రూ.4,300 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు.
చేతికొచ్చిన మొక్కజొ న్న, వరి, సోయా పంటలు అ కాల వర్షాలతో తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తోంది. ధాన్యం ఆరబెట్టుకోవడానికి స్థలాలు లేక రోడ్లమీద పోస్తున్నాం. కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో ధాన్యాన్ని తీసుకోకపోవడంతో దళారులకే అమ్ముకోవాల్సి వస్తోంది.
– రాజిరెడ్డి, తిర్మన్‌పల్లి, సదాశివనగర్
దళారులకు ‘తుపాను’ మేలు


