పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన లారీ
● కానిస్టేబుల్, హోంగార్డుకు గాయాలు
కామారెడ్డి క్రైం: పెట్రో లింగ్ నిర్వహిస్తూ జాతీ య రహదారిపై యూ టర్న్ తీసుకుంటున్న పోలీసు వాహనాన్ని అతివేంగా వచ్చిన గు ర్తు తెలియని లారీ ఢీకొనడంతో ఇద్దరు సిబ్బందికి గాయాలయ్యా యి. వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని క్యాసంపల్లి వద్ద హైవే పెట్రోలింగ్ కారు (ఇన్నోవా) యూటర్న్ తీసుకోబోయింది. అదే సమయంలో వేగంగా హైదరాబాద్ వైపు నుంచి నిజామాబాద్ వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. విధుల్లో ఉన్న కానిస్టేబుల్ సదయ్య, హోంగార్డు స్వామిరెడ్డికి గాయాలయ్యాయి. వారిని వెంటనే జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. సదయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు హైదరాబాద్‌కు రిఫర్ చేశారు. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. లారీని ఇందల్వాయి టోల్‌గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది.


