ఎస్‌జీఎఫ్ క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ
బాన్సువాడ రూరల్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడల్లో మండలంలోని తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు ప్రతిభ కనబర్చారని పీఈటీ సుప్రిత బుధవారం తెలిపారు. రన్నింగ్ పోటీల్లో శ్రీనందిని, సౌజన్య, వాణి బహుమతులు సాధించారన్నారు. శ్రీనందిని, సౌజన్య రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. అలాగే అండర్–14 విభాగంలో 200మీటర్ల పరుగు పందెంతో పాటు లాంగ్‌జంప్‌లో జి. సాత్విక జిల్లాస్థాయిలో రెండు బంగారు పతకాలు అందుకుని రాష్ట్రస్థాయి ఎస్‌జీఎఫ్‌కు ఎంపికై ందన్నారు. ప్రతిభ చాటిన విద్యార్థినులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
మోపాల్(నిజామాబాద్‌రూరల్): తెలంగాణ యూనివర్సిటీని అక్రమాలకు అడ్డాగా మార్చొద్దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి విజ్ఞప్తిచేశారు. ఈమేరకు బుధవారం తెలంగాణ యూనివర్సిటీలో వీసీ యాదగిరి రావును ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, మాట్లాడారు. తెయూలో 2012 లో జరిగిన నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో వివిధ పత్రికల్లో వస్తున్న కథనాల గురించి వీసీతో చర్చించారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంపీ అర్వింద్ ధర్మపురి కృషి చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం రూ.20కోట్ల నిధులు మంజూరు చేసిందని గుర్తుచేశారు.మండల అధ్యక్షుడు చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పానుగంటి సతీష్‌రెడ్డి, నాయకులు శ్యామ్‌రావు, సురేష్, శ్రీనివాస్ గౌడ్,పరుశరాం, లక్ష్మీనారాయణ, పృథ్వీ, సమీర్, వినోద్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌జీఎఫ్ క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ


