యూడైస్‌లో విద్యార్థుల వివరాలను నమోదు చేయాలి
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● దర్యాపూర్‌లో ప్రభుత్వ పాఠశాల,
భవితకేంద్రం తనిఖీ
నవీపేట: యూడైస్ యాప్‌లో విద్యార్థుల పూర్తి వివరాలను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మండల కేంద్రంలోని దర్యాపూర్ ప్రాథమిక పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. యూడైస్ యాప్‌లో విద్యార్థుల వివరాలు నమోదు కాకపోవడంపై పాఠశాల హెచ్‌ఎం హన్మంత్‌రావ్‌పై అసహనం వ్యక్తం చేశారు. జనన ధ్రువీకరణ పత్రాలు లేని విద్యార్థులకు వెంటనే మంజూరు చేయాలని తహసీల్దార్ వెంకట రమణకు సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల వివరాలను ముఖ గుర్తింపు విధానంతో నమోదు చేయాలన్నా రు. అనంతరం భవితభవిత కేంద్రాన్ని తనిఖీ చేసి, ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల వివరాలను తెలుసుకున్నారు. కొనసాగుతున్న భవిత ప్రత్యేక కేంద్రం పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భవిత కేంద్రాల పనితీరు, మరమ్మతులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తానన్నారు. డీఈవో అశోక్, ఎంపీడీవో నాగనాథ్, తహసీల్దార్ వెంకట రమణ తదితరులు ఉన్నారు.


