ఇంటర్‌లో మంచి ఫలితాలు సాధించాలి
● ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీసర్ షేక్‌సలాం
ఎల్లారెడ్డి: మోడల్ కళాశాల విద్యార్థులు ఇంటర్‌లో మంచి ఫలితాలు సాధించాలని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ ఆఫీసర్ షేక్ సలాం అన్నారు. బుధవారం ఎల్లారెడ్డి మోడల్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. కళాశాలలోని అడ్మిషన్ రిజిస్టర్‌ను తనిఖీ చేసి విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. ప్రిన్సిపాల్ గాంధీ, అధ్యాపకులు జహంగీర్, రాజశేఖర్, ప్రియదర్శిని, లక్ష్మణ్ సింగ్ తదితరులు ఉన్నారు.
లింగంపేటలో..
లింగంపేట: ఇంటర్ వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా ఇంటర్ విద్యా నోడల్ అధికారి షేక్ సలామ్ సూచించారు. లింగంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న అర్ధవార్షిక పరీక్షలను తనిఖీ చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించాలని అధ్యాపకులకు సూచించారు. ఆయన వెంట ప్రిన్సిపాల్ నరేందర్, అధ్యాపకులు నాగు, దుర్గయ్య, శివ, రాజు, హైమద్, ధర్‌సింగ్, సంధ్యారాణి, శ్రీలత, స్వామిగౌడ్, ఆనంద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


