ట్రాన్స్‌ఫార్మర్ చోరీ
కామారెడ్డి టౌన్: జిల్లాకేంద్రంలోని సిరిసిల్లా రోడ్ త్రిశక్తి ఆలయం వెనకాల ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. అందులోని కాపర్ కాయిల్స్, ఆయిల్‌ను దొంగలించారు. మరుసటి రోజు ఏఈ మనోరంజన్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించి, పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూ. 80వేలకు పైగా నష్టం జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
పాన్‌షాపులో ..
నవీపేట: మండల కేంద్రంలోని వైన్‌షాపు సమీపంలోగల పాన్‌షాపులో గుర్తుతెలియని దుండగులు మంగళవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. మరుసటి రోజు ఉదయం షాపు నిర్వాహకుడు చోరీని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. షాపు తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు రూ.8500 నగదుతో పాటు రూ. 10వేల విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారు. ఈమేరకు బాధితుడు ముజాహిద్ అలీఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


