ఫోర్జరీ సంతకాలతో రుణం
సదాశివ నగర్(ఎల్లారెడ్డి): తనకు తెలియకుండా రుణం తీసుకున్నారని ఆరోపిస్తూ మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డికి చెందిన స్నేహ మహిళా సంఘం సభ్యురాలు షెకెల్లి త్రివేణి అనే మహిళ బుధవారం మహిళా సంఘం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. సంఘ సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి వీవోఏ వరలక్ష్మి, ఐకెపీ సీసీ లింగం కలిసి బ్యాంకులో రూ.15 లక్షల రుణం తీసుకున్నారని త్రివేణి ఆరోపించారు. దీనిపై డీఆర్డీవో, కలెక్టర్‌కు సైతం ఫిర్యాదు చేశానన్నారు. సంతకాలు ఫోర్జరీ చేసి రుణం తీసుకున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని త్రివేణి డిమాండ్ చేశారు.


