నేషనల్ కబడ్డీ క్యాంప్‌నకు ఎంపిక
నిజామాబాద్ నాగారం: జిల్లాకు చెందిన ఐదుగురు కబడ్డీ క్రీడాకారులు జాతీయస్థాయి కబడ్డీ క్యాంప్‌కు ఎంపికయినట్లు నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆంద్యాల లింగయ్య, గంగాధర్ రెడ్డి బుధవారం తెలిపారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో బాలికల విభాగంలో గౌతమీ, స్నేహ, శిరీష, బాలుర విభాగంలో శ్రీనివాస్, ప్రమోద్ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చారు. దీంతో వారు జాతీయస్థాయి క్యాంప్‌కు ఎంపికయ్యారు. ఈనెల 12 నుంచి బాచుపల్లిలో నిర్వహించనున్న జాతీయ స్థాయి కబడ్డీ క్యాంప్‌లో వారు పాల్గొననున్నట్లు తెలిపారు.


