జీపీవోలు అందుబాటులో ఉండాలి
ఎల్లారెడ్డి: జీపీవోలు గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండాలని తహసీల్దార్ ప్రేమ్‌కుమార్ సూచించారు. బుధవారం తహసీల్ కార్యాలయంలో జీపీవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జీపీవోలు వారికి కేటాయించిన రెవెన్యూ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలకు కావాల్సిన ధ్రువపత్రాలను సకాలంలో అందించాలని సూచించారు. కార్యక్రమంలో గిర్దావార్ శ్రీనివాస్, జీపీవోలు తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి: జిల్లా కేంద్రంలో ఈనెల 15వ తేదీన నిర్వహించే బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ తాడ్వాయి మండల కన్వీనర్ గడ్డం బాబు సాయికుమార్ బుధవారం కోరారు. 40 శాతం బీసీ రిజర్వేషన్ సాధనకు అందరూ పోరాటం చేయాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన ఉద్యోగులు, రాజకీయ నాయకులు, విద్యావంతులు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీలో అనుమతి లేకుండా చెట్లను నరికివేసిన వ్యక్తికి ఫారెస్ట్ అధికారులు రూ. 30,530 జరిమానాను బుధవారం విధించారు. తమ ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన ఫారెస్టు అధికారులకు బీఆర్‌ఎస్ నాయకులు అభినందనలు తెలిపారు. నాయకులు కుంబార రవియాద్, భాను, కృష్ణయాదవ్, చంద్రకాంత్, సాయి, సమీర్, సాయి తదితరులు ఉన్నారు.
నాగిరెడ్డిపేట: మండలంలోని తాండూర్‌లో ఉన్న మల్లికార్జునస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. వేదపండితులు ఆలయం వద్ద రుద్రహోమం చేపట్టారు. అనంతరం మల్లన్న స్వామి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు.
రాజంపేట: మండల పంచాయతీ అధికారిగా ఎండీ జబీర్ ఇమాముద్దీన్ హైమద్, కార్యాలయ పర్యవేక్షకుడిగా జనార్దన్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించినట్లు మండల అభివృద్ధి అధికారి బాలకృష్ణ తెలిపారు. వీరికి కార్యాలయ సిబ్బంది, మండల పంచాయతీ కార్యదర్శులు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.
జీపీవోలు అందుబాటులో ఉండాలి


