క్రైం కార్నర్
స్వదేశానికి చేరిన మృతదేహం
లింగంపేట(ఎల్లారెడ్డి): దుబాయ్‌లో నెలరోజుల క్రితం మృతిచెందిన ఓ వ్యక్తి మృతదేహం బుధవారం స్వగ్రామానికి చేరుకుంది. వివరాలు ఇలా.. మండలంలోని అయిలాపూర్ గ్రామానికి చెందిన మన్నె సంగమేశ్వర్(39) ఉపాధి నిమిత్తం గతేడాది దుబాయ్ దేశానికి వెళ్లాడు. గత నెల 11న అక్కడ పనులు చేస్తున్న చోట ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరుసటి రోజు కుటుంబ సభ్యులకు సమాచారం అందగా, వారు దుబాయ్‌లోని భారత సేవా సమితి సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం వారు కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి షార్జా నుంచి హైదరాబాదుకు సంగమేశ్వర్ మృతదేహాన్ని తరలించే ఏర్పాట్లు చేశారు. మృతుడికి తల్లిదండ్రులు పోచవ్వ, ఎల్లయ్య, భార్య సరిత, ఇద్దరు కుమారులు కార్తీక్, కౌశిక్ ఉన్నారు.
రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
మద్నూర్(జుక్కల్): మంజీరా నది నుంచి ఎలాంటి అనుమతులు లేకుండ అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్‌లను పట్టుకోని సీజ్ చేసినట్లు డోంగ్లీ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సాయిబాబా బుధవారం తెలిపారు. పోతంగల్ మంజీరా శివారులోని కోడిచెర్ల నుంచి రెండు ఇసుక ట్రాక్టర్‌లు డోంగ్లీ గుండా వెళ్తుండగా పట్టుకొని, డోంగ్లీ తహసీల్దార్ కార్యాలయానికి తరలించి సీజ్ చేశామని తెలిపారు.
పిట్లం మండలంలో..
పిట్లం(జుక్కల్): బిచ్కుంద మండలంలోని పుల్కల్ గ్రామం నుంచి మంగళవారం రాత్రి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పిట్లం శివాజీ చౌక్ వద్ద పట్టుకున్నట్లు ఎస్సై వెంకట్రావ్ తెలిపారు. మండల పోలీస్ స్టేషన్ బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
క్రైం కార్నర్
క్రైం కార్నర్
క్రైం కార్నర్


