అప్పులు తీర్చేందుకు చోరీకి యత్నం
కామారెడ్డి క్రైం: ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడి ఓ యువకుడు అప్పులు చేయగా, వాటిని తీర్చడానికి చోరీకి యత్నించాడు. పోలీసులు అతడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. జిల్లాకేంద్రంలో చోటుచేసుకున్న ఘటన వివరాలను బుధవారం కామారెడ్డి డీఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి వెల్లడించారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా రవింగర్‌కోటకు చెందిన దుయ్యవార్ రోహిత్ మారుతి ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు. ఇటీవల అతడు నీట్‌లో ర్యాంకు సాధించి వెటర్నరీ సీటు సంపాదించాడు. కానీ ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటు పడి రూ.60వేల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చడం కోసం దొంగతనాలు, దోపిడీలబాట పట్టాడు. ఈక్రమంలో కామరెడ్డిలోని వివేకానంద కాలనీలో మంగళవారం సాయంత్రం కొండా లలిత అనే వృద్ధురాలు తన ఇంట్లో ఒంటరిగా ఉండగా అతడు ఆమె వద్దకు వెళ్లి మంచి నీళ్లు కావాలని అడిగాడు. ఆమె నీళ్లు తేవడానికి ఇంట్లోకి వెళ్తుండగా వెనుక నుంచి దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పరారయ్యాడు. అతడు కాలనీలో పరిగెడుతుండగా అటుగా వచ్చిన ఎన్‌సీసీ క్యాడెట్‌లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని చుట్టుపక్కల సీసీ కెమెరాలు పరిశీలిస్తూనే గాలింపు చర్యలు చేపట్టారు. ఓచోట నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అప్పులు తీర్చడం కోసం చోరీకి యత్నించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని రిమాండ్‌కు తరలిస్తున్నామనన్నారు. పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డిలో వృద్ధురాలి మెడలో నుంచి బంగారు చైన్‌ను లాక్కెళ్లిన యువకుడు
అరెస్టు చేసి, రిమాండ్‌కు
తరలించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన ఏఎస్పీ చైతన్య రెడ్డి


