ధాన్యాన్ని నిబంధనల మేరకు ఆరబెట్టాలి
గాంధారి(ఎల్లారెడ్డి): రైతులు ధాన్యాన్ని నిబంధనల మేరకు ఆరబెట్టాలని డీఆర్‌డీవో సురేందర్ సూచించారు. మంగళవారం ఆయన మండలంలో పర్యటించారు. మేడిపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఏపీఎం ప్రసన్న కుమార్, రైతులున్నారు.
తూకం వేగవంతం చేయాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేగవంతం చేయాలని డీఆర్‌డీవో సురేందర్ సూచించారు. మంగళవారం ఆయన లింగంపేట మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రాల్లో తూకం పరిశీలించారు. అనంతరం ఆయన రైతులతో మాట్లాడారు. ఐకేపీ డీపీఎం సాయిలు, ఏపీఎం వినోద్‌కుమార్, సీసీ గంగ రాజం, తదితరులు ఉన్నారు.


