‘మత్స్య పరిశ్రమను విద్యార్థులు వృత్తిగా స్వీకరించాలి’
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఫిషరీస్, జువాలజీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన ఆక్వేరియం చేప పిల్లల విక్రయాన్ని మంగళవారం ప్రిన్సిపల్ కె.విజయకుమార్ ప్రారంభించారు. విద్యార్థులు మత్స్య పరిశ్రమలను వృత్తిగా స్వీకరించేందుకు ముందు వరుసలో ఉండాలని, వాణిజ్యపరంగా ఎన్నో అవకాశాలుంటాయన్నారు. సమన్వయకర్తలు విశ్వప్రసాద్, జయప్రకాష్, సుధాకర్, అధ్యాపకులు దినకర్, ఫిషరీస్ విభాగం అధిపతి తిరుమల మల్సూర్, రాములు, జి.శ్రీనివాస్‌రావు, పవన్ కుమార్, మానస తదితరులు పాల్గొన్నారు.


