డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ పలువురికి జైలు
ఇందల్వాయిలో ఇద్దరికి..
మోపాల్‌లో ముగ్గురికి..
జగిత్యాల జిల్లా వాసికి రూ. పదివేల జరిమానా
డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ పలువురికి జడ్జిలు జైలు శిక్షతో పాటు జరిమానాలను విధించినట్లు ఎస్సైలు తెలిపారు. ఏర్గట్ల పీఎస్ పరిధిలో ఒకరికి నూతన చట్టం ప్రకారం రూ. పదివేల జరిమానాను విధించారు.
రుద్రూరు: డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఓ వ్యక్తికి రెండు రోజుల జైలు శిక్షతోపాటు రూ. రెండు వేల జరిమానాను బోధన్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్పసాయి విధించినట్లు కోటగిరి ఎస్సై సునీల్ మంగళవారం తెలిపారు. రెండు రోజుల క్రితం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నాయిగావ్ గ్రామానికి చెందిన పవర్ దానాజీ మద్యం సేవించి కోటగిరిలో వాహనం నడుపుతుండగా పట్టుకొని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు పేర్కొన్నారు. జడ్జి అతనికి రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ. రెండు వేల జరిమానా విధించినట్లు ఎస్సై తెలిపారు.
సిరికొండలో నలుగురికి నాలుగు రోజులు..
సిరికొండ: సిరికొండ పీఎస్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ నలుగురికి న్యాయమూర్తి నాలుగు రోజుల జైలు శిక్ష విధించారని ఎస్సై రామకృష్ణ తెలిపారు. సిరికొండ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు, పెద్దవాల్గోట్‌కు చెందిన ఒకరు, సిరికొండ చెందిన మరొకరిని కోర్టులో హాజరుపర్చగా వారికి న్యాయమూర్తి నాలుగు రోజుల జైలు శిక్ష విధించారని ఎస్సై తెలిపారు.
బీబీపూర్ వాసికి నాలుగు రోజులు..
మోపాల్: డిచ్‌పల్లి పీఎస్ పరిధిలో నాగ్‌పూర్ గేట్ వద్ద ఈనెల 9న మద్యం సేవించి వాహనం నడిపిన బీబీపూర్‌కు చెందిన రాథోడ్ జై సింగ్‌కు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ నాలుగు రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనం నడిపిస్తే జైలు శిక్ష తప్పదని ఎస్సై హెచ్చరించారు.
జక్రాన్‌పల్లిలో ఇద్దరికి రెండు రోజులు..
జక్రాన్‌పల్లి: మద్యం తాగి బైక్ నడిపిన ఇద్దరు వ్యక్తులకు ఆర్మూర్ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి గట్టు గంగాధర్ రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు జక్రాన్‌పల్లి ఎస్సై మహేశ్ తెలిపారు. నూతన మోటర్ వెహికిల్ చట్టం ప్రకారం మొదటి సారి డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ. పది వేల జరిమానా ఉంటుందని అన్నారు.
నవీపేటలో ఇద్దరికి నాలుగు రోజులు..
నవీపేట: డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఇద్దరికి నిజామాబాద్ జడ్జి మంగళవారం జైలు శిక్ష విఽధించినట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. నవీపేట శివారులో ఇటీవల నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్‌లో నవీపేటకు చెందిన మోహన్, కమలాపూర్‌కు చెందిన ముల్కల అఖిలేష్ మద్యం సేవించి వాహనం నడిపారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపగా జడ్జి ఇద్దరికి నాలుగు రోజుల జైలు శిక్షను విధించినట్లు పేర్కొన్నారు.
మూడు, నాలుగో టౌన్ల పరిధిలో..
నిజామాబాద్ అర్బన్: నగరంలోని మూడో టౌన్ పీఎస్ పరిధిలోని పట్టుబడిన శివకుమార్‌కు నాలుగు రోజుల జైలు శిక్ష, నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన అశ్విన్, సాయికిరణ్‌కు నాలుగు రోజుల జైలు శిక్షను విధించినట్లు ఎస్సైలు తెలిపారు. అదే విధంగా మాక్లూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుబడ్డ ఏనుగంటి అవినాయక్ గౌడుకు రెండు రోజుల జైలు శిక్ష, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్టుబడ్డ కిషన్ గౌడ్, శివాజీ సుమ కాంత్‌కు జడ్జి రెండు రోజుల జైలు శిక్షను విధించినట్లు ఎస్సైలు పేర్కొన్నారు.
ఇందల్వాయి: డ్రంకన్ డ్రైవ్‌లోపట్టుబడ్డ ఇద్దరికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ జైలు శిక్షను విధించినట్లు ఎస్సై సందీప్ తెలిపారు. ఇందల్వాయి మండలం మెగ్యానాయక్ తండాకు చెందిన కాట్రోత్ రవికి ఏడు రోజులు, పాట తండాకు చెందిన లావుడ్య నర్సయ్యకు నాలుగు రోజుల జైలు శిక్షను విధించినట్లు పేర్కొన్నారు.
మోపాల్: మోపాల్ పీఎస్ పరిధిలో మద్యం సేవించి వాహనం నడిపిన ముగ్గురికి స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. డిచ్‌పల్లి మండలం ఆరెపల్లికి చెందిన చిట్టి నారాయణకు రెండు రోజులు, కులాస్‌పూర్‌కు చెందిన బూస భానుచందర్‌కు మూడు రోజులు, బైరాపూర్‌కు చెందిన కెతావత్ మహా పాతలాల్‌కు ఏడు రోజుల జైలు శిక్షను విధించారని అన్నారు.
మోర్తాడ్: డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఓ వ్యక్తికి నూతన వాహన చట్టం ప్రకారం రూ. పది వేల జరిమానాను ఆర్మూర్ జడ్జి గట్టు గంగాధర్ విధించినట్లు ఏర్గట్ల ఎస్సై పడాల రాజేశ్వర్ తెలిపారు. ఏర్గట్ల పీఎస్ పరిధిలో సోమవారం సాయంత్రం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం కోజన్‌కొత్తూర్ గ్రామానికి చెందిన నాని అనే వ్యక్తి మద్యం సేవించి ఏర్గట్లలో వాహనం నడుపుతుండగా పట్టుకొని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు. జడ్జి అతనికి రూ. పదివేల జరిమానా విధించినట్లు ఎస్సై పేర్కొన్నారు.


