‘న్యుమోనియా’ను నివారిద్దాం..!
అవగాహన తప్పనిసరి
జాగ్రత్తగా ఉండాలి
● జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు
● నేడు ప్రపంచ న్యుమోనియా
నివారణ దినం
నిజామాబాద్‌నాగారం: బ్యాక్టీరియా, వైరస్‌ల కారణంగా ఊపిరితిత్తుల్లోని గాలి సంచులు చీము, ద్రవాలతో నిండిపోయి శ్వాస తీసుకోవడం ఇబ్బందికరంగా మారుతుంది. దీనినే న్యుమోనియా అంటారు. ఇది ఒక్కోసారి ప్రాణాంతకంగా మారొచ్చు. బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల వచ్చే న్యుమోనియా ఇతరులకు సైతం వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఏటా అనేక మంది న్యుమోనియా బారిన పడుతూ ఇబ్బందులు పడుతున్నారు. నేడు నిర్వహించే న్యుమోనియో దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.
జిల్లా వ్యాప్తంగా ఇలా..
న్యుమోనియా వ్యాధి బాధితులు నిజామాబాద్ జిల్లాలో నిత్యం పెరుగుతూనే ఉన్నారు. బ్యాక్టీరియాతో వచ్చే న్యుమోనియా బాధితులు జిల్లాలో వారానికి సుమారు 200 మంది ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు సంబంధిత వైద్యాధికారులు చెబుతున్నారు. మరోవైపు చలికాలంలో అధికంగా వచ్చే వైరల్ న్యుమోనియాతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో నిత్యం 40 నుంచి 50 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వైరల్ న్యుమోనియాకు మందులు వాడితో వారం రోజుల్లో తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
వ్యాధి రావడానికి కారణాలు..
గాలి పీల్చేటప్పుడు బ్యాక్టీరియాలు, వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించి, తెల్లరక్త కణాలను నిర్వీర్యం చేస్తాయి. దీంతో శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. పిల్లల్లో ఆర్‌ఎస్‌వీ, వృద్ధుల్లో ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌వల్ల ఇది సోకుతుంది. పౌష్టికాహారం తీసుకోని వారి కి, మద్యపానం, పొగతాగడం, మధుమేహం, ఎ యిడ్స్, గుండె, ఊపిరితిత్తులు, మూత్రనపిండాల సమస్యలు, క్యాన్సర్‌తో బాధపడే వారు న్యుమోనియా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటా యని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలకు చిన్నతనంలో ఇచ్చే బీసీజీ వంటి టీకాలతో పాటు న్యు మోనియా రాకుండా టీకాలు అందిస్తే దీనిని నివారించవచ్చు. పిల్లలకు ఆరు నెలల వరకు తల్లి పాలు పట్టించడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి పెరిగి వ్యాధి బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.
న్యుమోనియపై కచ్చితంగా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ప్రమాదం. ప్రతి సంవత్సరం నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ యూనిట్‌లో న్యూమోనియా దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, ఉచిత శ్వాసకోశ పరీక్షలు, వైద్య సలహాలు అందిస్తున్నాం.
– డాక్టర్ ప్రశాంత్, శ్వాసకోశ వ్యాధుల నిపుణులు, మెడికవర్ హాస్పిటల్
దీర్ఘకాలిక రోగులతో బాధపడేవారు కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గుండె, షుగర్, బీపీ, కిడ్నీ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. వృద్ధులు కచ్చితంగా న్యుమోనియపై అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఏటా 10 శాతం మంది న్యుమోనియాతో మరిణిస్తున్నారు.
– వీవీరావు, జీజీహెచ్ పల్మనాలజిస్ట్, హెచ్‌వోడీ
‘న్యుమోనియా’ను నివారిద్దాం..!


