క్రీడల్లో గెలుపోటములు సహజం
● ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్
బాన్సువాడ: క్రీడల్లో గెలుపోటములు సహజమని ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ అన్నారు. ఉమ్మడి జిల్లా స్థాయి మహిళ, పురుషుల విభాగాల వాలీబాల్ టోర్నమెంట్ బాన్సువాడలో నిర్వహించా రు. మంగళవారం నిర్వహించిన టోర్నమెంట్ ము గింపు కార్యక్రమానికి హాజరైన కాసుల బాల్‌రాజ్ మాట్లాడుతూ.. క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి క్రీడలు దోహదపడతా యని అన్నారు. బాన్సువాడలో జిల్లా స్థాయి క్రీడలే కాకుండా రాష్ట్ర స్థాయి క్రీడలు నిర్వహించేందుకు కృషి చేస్తామని అన్నారు. పోటీల్లో ఉమ్మడి జిల్లా స్థా యి వాలీబాల్ టోర్నమెంట్ విజేత జట్టుగా బాన్సు వాడ నిలిచింది. మహిళల విభాగంలో బాన్సువాడ–మగ్గిడి జట్లు హోరాహోరీ సాగింది. పోటీల్లో బాన్సువాడ జట్టు విజయం సాధించింది. పురుషుల విభాగంలో బాన్సువాడ–తాడ్వాయి జట్టు త లపడగా బాన్సువాడ జట్టు విజయం సాధించింది. విజయం సాధించిన జట్లకు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్‌రాజ్ కప్‌లతో పాటు మెడల్స్ అందజేశారు. అలాగే విజయం సాధించిన క్రీడాకారులకు వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఫోన్‌లో అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, నాయకులు కృష్ణారెడ్డి, ఎజాస్, ఖలేక్, నార్ల సురేశ్, రవీందర్, వాహబ్, గౌస్, దావుద్, జిల్లా వాలీబాల్ అసో సియేషన్ ప్రతినిధులు మల్లేశ్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, కామారెడ్డి డీవైఎస్‌వో రంగాగౌడ్, నిజామాబాద్ డీ వైఎస్‌వో నవీన్, పీడీలు తదితరులు పాల్గొన్నారు.


