తెలంగాణ వైతాళికులు విశ్వనాథ శాస్త్రి
కామారెడ్డి అర్బన్: తెలంగాణ వైతాళికులు, జ్ఞాననిధి, సదాచారులు శాస్త్రుల విశ్వనాథశాస్త్రి(శివ్వంపేట) శత జయంతి ఉత్సవాన్ని మంగళవారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో సంకష్టహర గణపతి ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్థలతో ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేదపండితులు గణేష పూజతో పాటు విశ్వనాథశాస్త్రికి పుష్పాంజలి సమర్పించారు. నృత్యప్రదర్శనలు చేశారు. శ్రీమల్లికార్జున శివారాధ్యపీఠం పండితులు కాచాపురం నందీశ్వరశర్మ, బెజుగామ రామమూర్తి దంపతులను ఘనంగా సన్మానించారు.
కామారెడ్డి అర్బన్: కాంగ్రెస్ పార్టీ ఉత్తుత్తి బీసీ బిల్లు పెట్టి ప్రజలు మోసం చేయాలని చూస్తుందని బీసీ ఆక్రోశ సభ రాష్ట్ర అధ్యక్షుడు, విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు, వైస్ చైర్మన్ విశారదన్ మహరాజ్ అన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 42శాతం రిజర్వేషన్ అమలు కోసం నవంబర్ 15న కామారెడ్డి సత్యగార్డెన్‌లో నిర్వహించే బీసీ ఆక్రోశ సభకు బీసీలందరు తరలిరావాలని వారు పిలుపు నిచ్చారు. పట్టణంలోని స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో మంగళవారం వారు వివిధ కులాల నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌లో తమిళనాడు తరహా రిజర్వేషన్ల బిల్లు కోసం కార్యాచరణ ప్రారంభించి శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి కృషి చేయాలన్నారు. సమావేశంలో ఆక్రోశ సభ ఆహ్వాన కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్లుగా మర్కంటి భూమన్న, క్యాతం సిద్ధిరాములు, బాలార్జున్‌గౌడ్ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా వెంకట్, వేణుగోపాల్‌గౌడ్, పుట్ట మల్లికార్జున్, రమేష్‌బాబు, జీవీఎం విఠల్, లక్ష్మణ్, అరవింద్, భువనేశ్వర్, రాజు, సిరిగాద నర్సయ్య, పి.అంజయ్య, నాగభూషణం, సబ్బని కృష్ణహరి, డి.రాజయ్య, ధర్మపురి పాల్గొన్నారు.
తెలంగాణ వైతాళికులు విశ్వనాథ శాస్త్రి


