శుభ్రమైన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలి
బాన్సువాడ రూరల్: రైతులు శుభ్రమైన ధాన్యాన్ని ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోనాపూర్ క్లస్టర్ ఏఈవో జ్ఞానేశ్వర్ అన్నారు. మంగళవారం ఆయన సొసైటీ కార్యదర్శి సురేందర్‌రావు, సెంటర్ ఇన్‌చార్జి సాదఖ్ తదితరులతో కలిసి ధాన్యం కుప్పలను పరిశీలించారు. 17శాతం లోపు తేమ ఉండేలా ధాన్యం ఆరబెట్టాలని, తాళ్ళు, రంగుమారిన గింజలు లేకుండా చూడాలన్నారు.
పొతంగల్ కలాన్‌లో ధాన్యం కాంటాల
ప్రారంభం
గాంధారి(ఎల్లారెడ్డి): రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సింగిల్ విండో చైర్మన్ సాయికుమార్ అన్నారు. మంగళవారం పోతంగల్ కలాన్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కాంటాలను ప్రారంభించారు. విండో డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.


