గాయాలెన్నో..
● జిల్లాలోని పలుచోట్ల ఛిద్రమైన రోడ్లు, దెబ్బతిన్న వంతెనలు
● నెలలు గడుస్తున్నా మరమ్మతులు కరువు
● అవస్థలు పడుతున్న ప్రజలు
వర్షం
చేసిన
ఈయేడు వానాకాలంలో భారీ వర్షాలతో జిల్లాకు అపార నష్టం జరిగింది. ధ్వంసమైన రోడ్లు, దెబ్బతిన్న వంతెనలు మానని గాయాలుగా జిల్లాను వెంటాడుతున్నాయి. నెలలు గడుస్తున్నా వర్షం చేసిన గాయాల నుంచి ఇంకా కోలుకోవడం లేదు. రహదారులకు సంబంధిత అధికారులు మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : వానాకాలంలో భారీ వ ర్షాలతో రోడ్లు, వంతెనలు ఎన్నో దెబ్బతిన్నాయి. జి ల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రధాన రహదారులతోపాటు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడం, కోతకు గురవడంతో రాక పోకలకు ఇబ్బందికరంగా మారింది. పట్టణాల్లోనూ అనేక రోడ్లు కోతకు గురయ్యాయి. ముఖ్యంగా కా మారెడ్డి జిల్లా కేంద్రంలో చాలా రోడ్లు దెబ్బతిన్నా యి. కానీ ఇప్పటికీ పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఇంకాచాలా చోట్ల అలాగే వదిలేశారు.
మరమ్మతులకు సుమారు రూ.170 కోట్లు..
ఆగస్టు చివరి మాసంలో కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైన విషయం తెలిసిందే. జిల్లాలోని వివిధ మండలాల్లో మూడు రోజు ల్లో 50 సెం.మీ.ల నుంచి 70 సెం.మీ. వర్షపాతం న మోదైంది. దీంతో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నా యి. నెలలు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
జిల్లాలో రోడ్లు భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ)కి సంబందించి 65 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతినగా, 48 కల్వర్టులు పాడయ్యాయి. వీటికి తాత్కాలి క మరమ్మతుల కోసం రూ. 5.50 కోట్లు, పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడానికి రూ.120 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అప్పట్లో అంచ నాలు వేశారు. అలాగే పంచాయతీరాజ్‌శాఖ పరిధి లో 122 రోడ్లు, కల్వర్టులు దెబ్బతినగా వాటికి తా త్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు రూ.8కోట్లు అ వసరం అవుతాయని పంచాయతీరాజ్ శాఖ అధికారులు నివేదికలు రూపొందించారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు రూ.37.50 కోట్లు అవసరమని అంచనాలు తయారు చేశారు. భారీ మొ త్తంలో నష్టం జరిగినప్పటికీ ప్రభుత్వం తాత్కాలిక మరమ్మతులకు తప్ప, పూర్తిస్థాయి మరమ్మతులకు ఎలాంటి నిధులు కేటాయించలేదు. కాగా కొన్ని చోట్ల తాత్కాలిక పనులు చేపట్టారు. అవి కూడా ఇ బ్బందికరంగానే ఉన్నాయి.
రాకపోకలకు ఇబ్బందులు
భారీ వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు నెలలు గడిచి నా మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు రాకపోకలకు నానా ఇబ్బందులు ఎదుర్కోవా ల్సి వస్తోంది. జిల్లాలోని రామారెడ్డి, మాచారెడ్డి, పాల్వంచ, బీబీపేట, దోమకొండ, భిక్కనూరు, కామారెడ్డి, తాడ్వాయి, రాజంపేట, లింగంపేట, ఎల్లారెడ్డి, గాంధారి తదితర మండలాల్లో ఎ క్కువగా రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. అ యితే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు తొలగించాల్సి ఉండగా.. రోడ్లు, భవనా ల శాఖతోపాటు పంచాయతీరాజ్ శాఖ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కొన్ని ప నులు చేపట్టి, మిగతా వాటిని అలాగే వదిలేశా రు. నిధుల సమస్య వల్లే పనులు ముందుకు క దలడం లేదని సమాచారం.
ఎమ్మెల్యేలు చొరవ చూపితేనే..
జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, వంతెనల మరమ్మతులకు అవసరమైన నిధులు సాధించేందుకు ఎమ్మెల్యేలు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. నిధుల సమస్యతో మరమ్మతులకు నోచుకోక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యేలు స్పందించి జిల్లాకు నిధులు తీసుకురావడానికి ప్రయత్నించాలని పలువురు కోరుతున్నారు.


