జిల్లాకేంద్రంలో విస్త ృత తనిఖీలు
కామారెడ్డి క్రైం: ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో రా ష్ట్ర పోలీసు శాఖ సూచనల మేరకు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఈసందర్భంగా మంగళవారం సాయంత్రం కామారెడ్డిలో పోలీసుల సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. అదనపు ఎ స్పీ నరసింహరెడ్డి ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్సైలతో కూడిన 60 మంది సభ్యులు గల బృందా లు పట్టణంలోని కొత్త బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రధా న కూడళ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో విస్తృతంగా త నిఖీలు చేపట్టారు. ప్రయాణికులు బ్యాగులు, పార్సిళ్లను క్షుణంగా పరిశీలించారు. అనుమానిత వ్యక్తు లు కానీ, వస్తువులు కాని కనబడితే తమకు సమాచారం అందించాలని పోలీసులు తెలిపారు. తనిఖీ ల్లో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలున్నాయి.
జిల్లాకేంద్రంలో విస్త ృత తనిఖీలు


