రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి
● ధాన్యం కొనుగోలు కేంద్రాలను
సజావుగా నడిపించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
తాడ్వాయి(ఎల్లారెడ్డి)/కామారెడ్డి క్రైం : ధాన్యం కొ నుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, కేంద్రాలను సజావుగా నడిపించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి మండలం ఇస్రోజివాడిలోని వరి కొనుగోలు కేంద్రాన్ని, తాడ్వాయి, కృష్ణాజీవాడి శివారులో ఉన్న మక్క, వరి కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా రైతులతో క లెక్టర్ ముఖాముఖిగా మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రైతుల సూచనలు సేకరించి పంటల కొనుగోలు ప్రక్రియను పా రదర్శకంగా సమయ పాలనతో కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఎప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షణ చేయాలని, రైతులకు డబ్బు చెల్లింపులు సకాలంలో జరిగే లా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో మొత్తం 427 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 11,196 మంది రైతుల నుండి 1,23,993 మెట్రిక్ ట న్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. అందు లో 59,162 మెట్రిక్ టన్నులు దొడ్డురకం, 64,831 మెట్రిక్ టన్నులు సన్నరకం ఉన్నట్లు వెల్లడించారు. రైతుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.145 కోట్లు జమ చేశామన్నారు. తాడ్వాయి మండలంలోని కొనుగో లు కేంద్రం వద్ద ఒక రైతు తన కొడుకుతో కలసి ఉండడాన్ని కలెక్టర్ గమనించారు. ఆ బాలుడు పాఠశా లకు ఎందుకు వెళ్లలేదని ఆరా తీశారు. పిల్లలను ప్ర తిరోజు పాఠశాలకు పంపడం తల్లిదండ్రుల బాధ్య త అని వారికి సూచించారు. అదనపు కలెక్టర్ విక్టర్, డిప్యూటి ట్రెయినీ కలెక్టర్ రవితేజ, సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్, డీసీవో రామ్మోహన్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో సాజీద్‌అలీ, ఎంపీవో సవిత తదితరులు పాల్గొన్నారు.
రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి


