పంట కోత పనులు 60 శాతం పూర్తి
● డీఏవో మోహన్‌రెడ్డి
● మాల్తుమ్మెద విత్తనక్షేత్రంలో
ధాన్యం వేలం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): జిల్లాలో వానాకాలం పంటలకు సంబంధించి 60శాతం కోత పనులు పూర్తయ్యాయని డీఏవో(జిల్లా వ్యవసాయాధికారి) మోహన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని మాల్తుమ్మెద విత్తనోత్పత్తిక్షేత్రంలో మంగళవారం జరిగిన ధాన్యం వేలంపాట నిర్వహణలో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈయేడు వానాకాలం పంటలకు సంబంధించి మొత్తం 6లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారని, ఇప్పటివరకు లక్షా23వేల992మెట్రిక్‌టన్నుల ధాన్యం సేకరించామన్నారు. ఇటీవల సంభవించిన వదరల కారణంగా జిల్లాలో జరిగిన 26,429ఎకరాల పంటనష్టానికి సంబంధించి పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదించామన్నారు. కాగా మండలంలోని మాల్తుమ్మెద విత్తనక్షేత్రంలో ఈ యేడు యాసంగిలో 30ఎకరాలలో వరి, 20ఎకరాలలో జనుము, నస్రుల్లాబాద్ మండలంలోని బొప్పాస్‌పల్లి విత్తనక్షేత్రంలో 110ఎకరాలలో వరి, 10ఎకరాలలో జనుము పంటలను సాగు చేస్తారని ఆయన వివరించారు. అనంతరం మండలకేంద్రంలోని వ్యవసాయశాఖ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. నాగిరెడ్డిపేట శివారులో గల ఆయిల్‌పామ్ పంటను పరిశీలించారు.
మాల్తుమ్మెద విత్తనక్షేత్రంలో 2021వానాకాలం, యాసంగి సీజన్‌లలో సాగుచేసిన పంటలకు సంబంధించిన 770.50క్వింటాళ్ల ధాన్యాన్ని వేలం వేశారు. వేలంపాటలో నలుగురు వ్యాపారులు పా ల్గొనగా మండలంలోని తాండూర్‌కు చెందిన ఆగమయ్య అనే వ్యాపారి క్వింటాల్‌కు రూ. 1,910 చొప్పున పాడి ధాన్యాన్ని దక్కించుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ సీడ్స్ ఆర్‌ఎం రఘు, డీఏవో కార్యాలయ ఏడీఏ లక్ష్మిప్రసన్న, టెక్నికల్ ఏవో సంతోష్, విత్తనక్షేత్ర ఏడీఏ ఇంద్రసేన్, ఎల్లారెడ్డి ఏఎంసీ సీనియర్ అసిస్టెంట్ శశికాంత్, ఏఈవో శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.


