వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
బాన్సువాడ: ఇంటర్ పరీక్షల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఇంటర్మీడియట్ బోర్డు డిప్యూటీ సెక్రెటరీ పద్మ అన్నా రు. బాన్సువాడ ప్రభుత్వ బాలికల జూనియ ర్ కళాశాలను మంగళవారం ఆమె సందర్శించారు. కళాశాలలో వసతులు, సౌకర్యాలపై ఆరా తీశారు. అనంతరం డిప్యూ టీ సెక్రెటరీని కళాశాల అధ్యాపకులు సన్మానించారు. ప్రిన్సిపల్ అసద్ ఫారుఖ్ సిబ్బంది ఉన్నారు.
విధుల్లో ఎల్లప్పుడు
అప్రమత్తంగా ఉండాలి
పిట్లం(జుక్కల్) : పోలీసు సిబ్బంది విధుల్లో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాజేష్‌చంద్ర అన్నారు. పిట్లం పోలీస్ స్టేషన్ ను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ సిబ్బందితో మాట్లాడి, వారి పనితీరును స్వయంగా పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల అ వసరాలకు అనుగుణంగా పనిచే యడం ప్ర తి పోలీస్ సిబ్బంది బాధ్యత అని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో ఆలస్యం జ రగకూడదని సూచించారు. సిబ్బంది ఏవైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వాటిని పైఅధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి, సీఐ తిరుపతయ్య, ిఎస్సై వెంకట్రావ్ పాల్గొన్నారు.
మిల్లర్ల దోపిడీని అరికట్టాలి
బీబీపేట: రైస్‌మిల్లర్లు తరుగు పేరిట చేస్తున్న దోపిడీని అరికట్టాలని రైతులు డిమాండ్ చే శారు. ఈమేరకు మండల కేంద్రంలోని ప్ర ధాన చౌరస్తాలో మంగళవారం మండలంలో ని ఉప్పర్‌పల్లి రైతులు ట్రాక్టర్లలో ధాన్యాన్ని తీసుకువచ్చి ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. లారీలో తూ కం వేసి పంపించిన వడ్లను ముత్యంపేట నందిని రైస్‌మిల్ తరుగు పేరిటి 30 బ్యాగు లు కట్ చేస్తామని లేదంటే లారీని తిరిగి పంపిస్తామని రైస్‌మిల్ యజమాని తెలిపారన్నా రు. దీంతో విసుగుచెంది బీబీపేటకు వచ్చి ధర్నాకు దిగామన్నారు. గంటపాటు రోడ్డుపై బైఠాయించగా ఎస్సై ప్రభాకర్ అక్కడకు చే రుకొని రైతులను సముదాయించారు. రైస్‌మిల్ యజమానితో మాట్లాడుతానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి


