పత్తి అమ్మడానికి అవస్థలు
● సీసీఐ కొత్త నిబంధనలతో తంటాలు పడుతున్న అన్నదాతలు
● ఎకరానికి 7క్వింటాళ్లు మాత్రమే
కొనుగోలు చేస్తామంటున్న అధికారులు
మద్నూర్(జుక్కల్) : పత్తి అమ్మడానికి సీసీఐ అధికారులు నిబంధనల పేరుతో అవస్థలు పెడుతున్నా రని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎ న్నడు లేనంతగా పత్తిని అమ్ముకోవడానికి నిబంధ నలు పెట్టినట్లు వారు వాపోతున్నారు. ఎకరాకు 13 క్వింటాళ్లకు బదులుగా 7 క్వింటాళ్ల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు చెబుతు న్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన యాప్‌లోనే ప త్తి స్లాట్ బుకింగ్ చేసుకోవాలని సూచించడంతో చా లా మంది రైతుల వద్ద ఆండ్రాయిడ్ ఫోన్లు లేక కష్టా లు పడుతున్నారు. అలాగే పత్తికి తేమ శాతం 8కి మించకుడదని అధికారులు చెప్పడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 54,357 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. కొనుగోలు కేంద్రాలు మాత్రం ఉమ్మడి నిజామాబాద్, కామా రెడ్డి జిల్లాలో కేవలం మద్నూర్‌లోనే కొనసాగుతున్నాయి. ఈక్రమంలో పత్తిని అమ్మడానికి ఉమ్మడి జిల్లా రైతులు మద్నూర్‌కు తీసుకువస్తున్నారు.
కానీ అధికారులు మాత్రం తేమ శాతం సరిగ్గా లేదని, పత్తి పంట నల్లగా మారిందని ఇలా అనేక కారణాలు చూపుతూ పత్తిని తీసుకొచ్చిన రైతులను తిప్పి పంపిస్తున్నారని వారు ఆందోళన చెందుతున్నారు. పంట కొనుగోళ్లకు ఒకవైపు అధికారులు కొర్రీలు పెడుతుండగా, మరోవైపు కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి రైతులు తెచ్చిన పంట మొత్తాన్ని కొనుగోలు చేయాలని పలువురు కోరుతున్నారు.


