ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి
● జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
● క్యాంప్ కార్యాలయంలో
ప్రజాదర్బార్ నిర్వహణ
నిజాంసాగర్ (జుక్కల్): ప్రజా సమస్యల పరిష్కా రం దిశగా అధికారులు తమవంతు కృషి చేయాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. జుక్కల్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. గ్రామాల వారీగా వచ్చిన సమస్యలను తెలుసుకొని ఆయా శాఖల అధికారుల దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. జుక్కల్‌లో పోస్ట్‌ఆఫీస్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని సామాజికవేత్త తమ్మేవార్ అజయ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను ఆయన సన్మానించారు.


