మెడికల్‌ దందా! | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ దందా!

Nov 11 2025 5:45 AM | Updated on Nov 11 2025 5:45 AM

మెడిక

మెడికల్‌ దందా!

లైసెన్స్‌ రద్దు చేస్తాం

● దేవునిపల్లికి చెందిన నరేందర్‌కు జ్వరంతోపాటు ఒళ్లు నొప్పులు రావడంతో ఓ మెడికల్‌ షాప్‌కు వెళ్లి సమస్య చెప్పాడు. దుకాణం నిర్వాహకుడు కొన్ని రకాల మందులు ఇచ్చి ఎలా వాడాలో సూచించాడు. డాక్టర్‌ ప్రిిస్క్రప్షన్‌ ఏదీ లేకుండానే మెడికల్‌ షాప్‌లో ఇచ్చిన ఆ మందులను మూడు రోజులపాటు వాడినా జ్వరం తగ్గకపోవడంతో నరేందర్‌ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పరీక్షలు నిర్వహించి, రక్తంలో ఇన్ఫెక్షన్‌ ఉండడంతో ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందించారు.

● కామారెడ్డిలోని అయ్యప్పనగర్‌కు చెందిన సురేశ్‌.. తన తల్లికి వైద్యుడు రాసిచ్చిన మందులను తీసుకోవడానికి ఓ మెడికల్‌ షాప్‌కు వెళ్లాడు. మెడికల్‌ షాప్‌ నిర్వాహకుడు బ్రాండెడ్‌కు బదులు జనరిక్‌ మందులు ఇచ్చి.. అసలు ధర వసూలు చేశాడు. దీనిని గమనించిన సురేశ్‌ దుకాణం నిర్వాహకుడితో వాగ్వాదానికి దిగాడు. మందులు వాపస్‌ ఇచ్చి వేరే షాప్‌లో తీసుకున్నాడు.

కామారెడ్డి టౌన్‌ : మెడికల్‌ దందాకు కేరాఫ్‌గా కామారెడ్డి పేరుగాంచింది. హైదరాబాద్‌ తర్వాత ఇక్కడే మెడికల్‌ ఏజెన్సీలు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాలో 600లకుపైగా మెడికల్‌ దుకాణాలు రిజిస్ట్రర్‌ అయి ఉన్నాయి. అనధికారికంగా నడుస్తున్నవి మరో ఐదారు వందల వరకు ఉంటాయి. ఏదైనా మెడికల్‌ షాప్‌లోనో ఆస్పత్రిలోనో కొంతకాలం పనిచేసినవారు బీఫార్మసీ సర్టిఫికెట్‌ను అద్దెకు తీసుకుని దుకాణం తెరుస్తున్నారు. చాలాచోట్ల ఫార్మసిస్ట్‌లే ఉండడం లేదు. దుకాణం నిర్వాహకులే మందులు అమ్ముతున్నారు.

జనరిక్‌ మందు.. బ్రాండెడ్‌ రేటు..

అర్హతలు లేకున్నా మందుల దుకాణం నిర్వహిస్తున్నవారు ఎక్కువగా జనరిక్‌ మందులనే అంటగడుతున్నట్లు తెలుస్తోంది. అదీ పూర్తి ధరకు అమ్ముతున్నారు. వైద్యులు రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్‌(మందుల చీటి) చూసి మాత్రమే మందులు ఇవ్వాల్సి ఉండగా.. ఈ నిబంధనను ఎవరూ పట్టించుకోవడం లేదు. రోగి చెప్పిన లక్షణాల ఆధారంగా యాంటీబయాటిక్స్‌తోపాటు రెండుమూడు రకాల మందులు ఇచ్చి పంపిస్తున్నారు. చాలా మెడికల్‌ షాప్‌లలో ఇష్టారాజ్యంగా మందులు విక్రయిస్తున్నారు. మందులకు సంబంధించిన బిల్లులు సైతం ఇవ్వడం లేదు. అలాగే రికార్డులను సైతం నిర్వహించడం లేదు. సమయం దొరికినప్పుడు తీరిగ్గా కూర్చుని ఒకేసారి బిల్లులు తయారు చేసుకుంటున్నారని, తనిఖీల సమయంలో వాటిని చూపిస్తూ తప్పించుకుంటున్నారని తెలుస్తోంది.

జిల్లాలో రెగ్యులర్‌గా మెడికల్‌ దుకాణాలను తనిఖీ చేస్తున్నా. మెడికల్‌ షాప్‌లలో ఫార్మసిస్టులు మాత్రమే మందులు విక్రయించాలి. బిల్లులు, రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలి. ఫార్మసిస్టు లేకున్నా, ప్రిస్క్రిప్షన్‌ లేకుండా మందులు విక్రయించినా చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే లైసెన్స్‌ రద్దు చేస్తాం.

– రాజిరెడ్డి, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, కామారెడ్డి

తనిఖీలు లేక..

ఔషధ నియంత్రణ శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఒక్కరే ఉన్నారు. దీంతో జిల్లాలో మెడికల్‌ షాప్‌లపై తనిఖీలు కరువయ్యాయి. అప్పుడప్పుడు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారన్న విమర్శలున్నాయి. తనిఖీల సమాచారం ముందే లీకవుతుండడంతో దుకాణాల నిర్వాహకులు ఆ సమయంలో ఫార్మసిస్టులను అందుబాటులో ఉంచుతున్నారు. దాడుల సమయంలో కొందరు షాప్‌లను మూసి ఉంచుతున్నారు.

జిల్లాలో మెడికల్‌ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఎలాంటి అర్హతలు లేకున్నా సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని దుకాణాలను నిర్వహిస్తున్నారు. డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌ లేకున్నా మందులు అమ్ముతున్నారు. జనరిక్‌ మందులను సైతం పూర్తి ధరకు అంటగడుతూ దోచుకుంటున్నారు.

అర్హత లేకున్నా అద్దె సర్టిఫికెట్‌లతో నిర్వహణ

షాపుల్లో కనిపించని ఫార్మసిస్టులు

జనరిక్‌ మందులనూ

ఎమ్మార్పీకే అంటగడుతున్న వైనం

డాక్టర్‌ చీటీ లేకున్నా అమ్మకాలు

చర్యలు తీసుకోని అధికారులు

మెడికల్‌ దందా!1
1/1

మెడికల్‌ దందా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement