17న ఖేలో ఇండియా అథ్లెటిక్స్ పోటీలు
కామారెడ్డి అర్బన్: జిల్లాకేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈనెల 17న అస్మిత ఖేలో ఇండియా జిల్లాస్థాయి అథ్లెటిక్స్ లీగ్ పోటీలు నిర్వహించనున్నారు. అండర్–14, 16 బాలికల విభాగంలో ఈ పోటీలు జరగనున్నాయి. బాలికలను క్రీడారంగంలో ప్రో త్సహించడం, వచ్చే ఒలింపిక్స్ కోసం సన్న ద్ధం చేయడానికి కేంద్ర క్రీడ, యువజన శాఖ సంకల్పం మేరకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అ ధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జైపాల్‌రెడ్డి, అ నిల్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల బాలికలు బోనఫైడ్ సర్టిఫికెట్‌తోపాటు క్రీడా దుస్తులు ధరించి ఈనెల 17న ఉద యం 8 గంటలకు ఇందిరాగాంధీ స్టేడియాని కి రావాలని సూచించారు. లాంగ్‌జంప్, హై జంప్, షార్ట్‌పుట్, డిస్క్‌త్రో, జావెలిన్‌త్రో అంశాలలో పోటీలుంటాయని తెలిపారు.
కలెక్టర్‌ను కలిసిన
మార్క్‌ఫెడ్ డీఎం
కామారెడ్డి క్రైం: మార్క్‌ఫెడ్ డీఎం శశిధర్‌రెడ్డి సోమవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను కలిసి మొక్కను అందజేశారు. ఆయన గతంలో మార్క్‌ఫెడ్ రాష్ట్ర కార్యాలయంలో పనిచేశారు. ఇటీవలే కామారెడ్డి జిల్లా మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం కలెక్టరేట్‌కు వచ్చిన కలెక్టర్‌ను ఆయన మర్యాదపూర్వకగా కలిశారు. ఇక్కడ పనిచేసిన మార్క్‌ఫెడ్ డీఎం మహేష్ నిర్మల్ జిల్లాకు బదిలీపై వెళ్లిన విషయం తెలిసిందే.
బాధ్యతల స్వీకరణ
లింగంపేట: మండల వైద్యాధికారి హిమబిందు సోమవారం ఎల్లారెడ్డి డివిజన్ ఉప వైద్యాధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. తనకు అప్పగించిన అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. అనంతరం వైద్య సిబ్బంది ఆమెను సన్మానించా రు. సీహెచ్‌వో రమేశ్, పర్యవేక్షకులు ఫరీదా, సిబ్బంది చంద్రకళ, యాదగిరి, ఫార్మసిస్టు ప్రదీప్, ల్యాబ్ టెక్నిషియన్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
టీఎన్జీవోస్ సభ్యత్వం..
కామారెడ్డి అర్బన్: జిల్లా ట్రెజరీ, ఉద్యానవన శాఖల ఉద్యోగులు సోమవారం తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం సభ్యత్వం స్వీకరించారు. కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నరాల వెంకట్‌రెడ్డి, ముల్క నాగరాజు, ప్రతినిధులు దేవరాజు, రాజేశ్వర్, అనుదీప్‌రెడ్డి, స్వప్న, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
17న ఖేలో ఇండియా అథ్లెటిక్స్ పోటీలు


