15న బీసీ ఆక్రోశ సభ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : విద్య, ఉద్యోగా లతో పాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న బీసీ ఆక్రోశ సభ నిర్వహించనున్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో కామారెడ్డిలోని సత్య కన్వెన్షన్‌లో సభ జరగనుంది. జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు తదితరుల ఆధ్వర్యంలో సభకు ప్లాన్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. అందులో రిజర్వేషన్లతో పాటు అనేక హామీలు ఇచ్చింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా ఏ ఒక్కటీ అమలు కాలేదని బీసీలు ఆగ్రహంతో ఉన్నారు. విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమ లు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావ డానికి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా బీసీ ఆక్రోశ సభకు ప్లాన్ చేశారు. మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులను సభకు ఆహ్వానిస్తున్నారు.
మద్నూర్: విద్యార్థుల జీవితంలో ఇంటర్మీడియట్ ఎంతో ముఖ్యమైనదని డీఐఈవో ఒడ్డెన్న పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. విద్యార్థుల హజరు శాతంపై ఆరా తీశారు. విద్యార్థులు నిత్యం కళాశాలకు వచ్చేలా లెక్చరర్లు చూడాలన్నారు. ఇంటర్‌లో వంద శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ పాండురంగ్, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
సదాశివనగర్: అడ్లూర్ ఎల్లారెడ్డిలోని గాయత్రి షుగర్స్ ఫ్యాక్టరీలో శుక్రవారం చెరుకు క్రషింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా కేన్ క్యారియర్‌కు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం క్యారియర్‌లో చెరుకు గడలను వేశారు. అనంతరం ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్‌రావు మాట్లాడుతూ ఈ సీజన్ విజయవంతం అయ్యే వరకు రైతులు, కార్మికులు, ఉద్యోగులు సహకరించాలన్నారు. టన్ను చెరుకుకు రూ. 3,775 చెల్లిస్తున్నామన్నారు. కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ ఇర్షాదొద్దీన్, ఫైనాన్స్ మేనేజర్ మాలకొండయ్య, డిస్టిలరీ జనరల్ మేనేజర్ సుబ్బారావు, మేనేజర్ రెడ్డయ్య, సీనియర్ జీఎం ఇంజినీర్ వీరరాజు, జనరల్ మేనేజర్ కుటుంబరావు, మాజీ వైస్ ఎంపీపీ రూపేందర్ రెడ్డి, పర్సనల్ మేనేజర్లు బస్వ పున్నారెడ్డి, హరీశ్, కార్మిక సంఘాల నాయకులు రాజేశ్వర్, మహేశ్, మహీపాల్‌రెడ్డి, కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: దివ్యాంగుల కోసం విశేష సేవలు అందిస్తున్న వారికి రాష్ట్రస్థాయి పురస్కారాలు అందజేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం అర్హులైన వ్యక్తులు, సంస్థల నుంచి ఈనెల 12 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. వ్యక్తులు, సంస్థలు తాము చేస్తున్న దివ్యాంగ సేవలకు సంబంధించి తగిన ధ్రువీకరణ పత్రాలు జతచేసి అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆ ప్రతులను కలెక్టరేట్‌లోని 31వ నంబర్ గదిలోని తమ కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు. ఎంపికై న వారికి డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో పురస్కారాలు అందజేస్తారని తెలిపారు.
కామారెడ్డి క్రైం: అవినీతి ఆరోపణలు రావడంతో బాన్సువాడ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ అనే కానిస్టేబుల్‌పై ఎస్పీ రాజేశ్ చంద్ర క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అతడిని కామారెడ్డి డీఏఆర్‌కు బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఇటీవల పేకాట కేసుల్లో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా పడింది. డబ్బులు చెల్లించే విషయంలో ఒక్కో వ్యక్తి నుంచి జరిమానా కంటే అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు సదరు కానిస్టేబుల్‌పై ఫిర్యాదులు వచ్చాయి. విషయం ఎస్పీ దృష్టికి రావడంతో అతడిని జిల్లా పోలీసు కార్యాలయంలోని డీఏఆర్‌కు అటాచ్ చేసినట్లు తెలిసింది.
15న బీసీ ఆక్రోశ సభ


