150 ఏళ్ల ‘వందేమాతరం’ వేడుక
కామారెడ్డి క్రైం: బంకించంద్ర చటర్జీ ‘వందేమాతరం’ రచించి 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా వందేమాతర గేయాలాపన చేశారు. ఉదయం 10 గంటలకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేశ్‌చంద్ర ఆధ్వర్యంలో, కలెక్టరేట్‌లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుమోహన్ ఆధ్వర్యంలో అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్య్ర సమరం నేపథ్యాన్ని, విశిష్టతను స్మరించుకున్నారు. కార్యక్రమాలలో ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు, పాల్గొన్నారు.


