పరీక్షలను వాయిదా వేయాలి
● ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల
అసోసియేషన్ ప్రతినిధుల నిరసన
తెయూ(డిచ్‌పల్లి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అన్ని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీలు బంద్ పాటిస్తున్నందున పరీక్షలను వాయిదా వేయాలని ప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. గురువారం తెయూ క్యాంపస్ మెయిన్ గేట్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. అనంతరం తెయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రాకపోవడంతో కళాశాలలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అధ్యాపకులు, సిబ్బందికి నెలవారీ వేతనాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నాలుగు రో జుల నుంచి కళాశాలలను నిరవధికంగా బంద్ చేసి ప్రభుత్వ మొండి వైఖరిపై తమ నిరసన తెలియజేస్తున్నామన్నారు. కళాశాలలు బంద్ ఉండటంతో వి ద్యార్థులు పరీక్ష ఫీజులు చెల్లించేందుకు రాలేకపోయారని తెలిపారు. కళాశాలల బంద్ పూర్తయ్యే వ రకు పరీక్షల టైంటేబుల్ విడుదల చేయొద్దని, పరీక్ష ఫీజు చెల్లించే తేదీని పొడిగించాలని విన్నవించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరాల సుధాకర్, మారయ్యగౌడ్, శంకర్, శ్రీనివాసరాజు, గురువేందర్ రెడ్డి, అరుణ్, గిరి, రమణ, సత్యం, దత్తు, విజయ్, గంగాధర్, చందన్, గంగారెడ్డి, రషీద్, షకీల్, వెంకటకిషన్ పాల్గొన్నారు.


