సాక్షి నెట్‌వర్క్: జిల్లావ్యాప్తంగా బతుకమ్మ సంబురా లు ఘనంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అట్ల బతుకమ్మ, సద్దుల బ తుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈసందర్బంగా ఆయా మండలాలు, గ్రామాల్లో మహిళలు ఉద యం నుంచే వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చారు. సాయంత్రం వేళ బతుకమ్మల ను ప్రధాన కూడళ్లు, రోడ్లపై ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు ని ర్వహించారు. అనంతరం మహిళలు, యువతులు వాటిచుట్టూ బతుకమ్మ పాటలు పాడుతూ, నృత్యం చేశారు. పలుచోట్ల మహిళలు కోలాటం ఆడుతూ సందడి చేశారు. అనంతరం స్థానిక చెరువుల్లో బతుకమ్మలను నిమజ్ఞనం చేశారు. అస్ట్రేలియాలో దేశంలో హిందూ మహాసభ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజశేఖర్, సౌజన్య, అఖిలతో పాటు జిల్లా వాసులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
బేగంపూర్ గ్రామంలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు, యువతులు
బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
బంగారు బతుకమ్మ ఉయ్యాలో..