
కుటుంబ ప్రయోజన పథకాన్ని వినియోగించుకోవాలి
బాన్సువాడ రూరల్/భిక్కనూరు : జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఆర్థిక సాయం పొందడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బాన్సువాడ సబ్ కలెక్టర డాక్టర్ కిరణ్మయి అన్నారు. జాతీయ కుటుంబ భద్రత పఽథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ధి చంద్రకాంత్‌రెడ్డి కోరారు. శుక్రవారం భిక్కనూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు.కుటుంబ పెద్ద మృతి చెందినట్లయితే ప్రభుత్వం రూ.20వేలు ఆర్థికసాయం అందిస్తుందన్నారు. పథకానికి అర్హత పొందాలంటే మృతిని వయస్సు 18 నుంచి 59 ఏళ్ల మద్య ఉండి 12 ఏప్రిల్ 2017 తర్వాత మృతి చెంది ఉండాలన్నారు.