
విద్యార్థుల సంఖ్యను పెంచే బాధ్యత ఉపాధ్యాయులదే
డీఈవో రాజు
భిక్కనూరు/దోమకొండ : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే బాధ్యత ఉపాధ్యాయులదేనని డీఈవో రాజు అన్నారు. భిక్కనూరు, దోమకొండ మండలాల్లో నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష మండల స్థాయి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఉపాధ్యాయులు తమ సామర్థ్యాన్ని పెంపోందించుకుని బడి బాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేవిధంగా కృషిచేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని డీఈవో రాజు అన్నారు. కార్యక్రమంలో ఏఎంవో వేణుగోపాల్‌శర్మ, ఎంఈవో రాజ్‌గంగారెడ్డి, కోర్సు డైరెక్టర్ మాణిక్యశర్మ, ఆర్పీలు శ్రీనివాస్ శర్మ, ఆనంద్‌రావు, ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.