
పెళ్లి కుదరడం లేదని..
కమ్మర్‌పల్లి: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని బాధపడుతూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కమ్మర్‌పల్లి మండలం ఇనాయత్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై అనిల్‌రెడ్డి తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఇనాయత్‌నగర్ గ్రామానికి చెందిన జక్కుల రాజ్‌కుమార్(23)కు కుటుంబసభ్యులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో సోమవారం సాయంత్రం ఇంట్లో ఉన్న గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు నిజామాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మంగళవారం అర్ధరాత్రి పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి తండ్రి రాజన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.