
ముదిరాజ్‌లు ఐక్యత చాటాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): ముదిరాజ్‌లు ఐక్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. బుధవారం ఆయన మండలంలోని పర్మళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పెద్దమ్మ ఆలయాలు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ముదిరాజ్ కులస్తులకు సీఎం రేవంత్‌రెడ్డి న్యాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముదిరాజ్‌లను బీసీ డి నుంచి బీసీ ఏ లోకి మార్చడానికి కార్యచరణ కొనసాగుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు సహకారంతో నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో సొసైటీల ఏర్పాటు, కమ్యూనిటీ భవనాల నిర్మాణం చేసుకోవాలని సూచించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముదిరాజ్ సంఘం భవనం కోసం రెండు ఎకరాల స్థలం కేటాయించినట్లు తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్‌లు సత్తా చాటాలన్నారు. ఎమ్మెల్సీ కోటా నుంచి ముదిరాజ్‌లకు రూ. 10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ అధ్వర్యంలో నాయకులకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్, టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేశ్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రజిత, వెంకట్రాంరెడ్డి, జిల్లా ముదిరాజ్ అధ్యక్షుడు బట్టు విఠల్, మండల అధ్యక్షుడు దాసరి సాయికుమార్, పర్మళ్ల మాజీ సర్పంచ్ బద్ద లక్ష్మయ్య, ముదిరాజ్ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మండలి డిప్యూటీ చైర్మన్‌కు
ముదిరాజ్ సంఘం నాయకుల స్వాగతం
కామారెడ్డి అర్బన్: ముదిరాజ్ జిల్లా సంఘానికి కామారెడ్డిలో కేటాయించిన రెండు ఎకరాల స్థలానికి హద్దులు నిర్ణయించి చూపించాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఆర్డీవోను కోరారు. బుధవారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ కామారెడ్డి ఆర్ అండ్ బీ అతిథిలో ముదిరాజ్ సంఘం నాయకులు పున్న రాజేశ్వర్, గజ్జల బిక్షపతితో పాటు పలువురు నాయకులు బండ ప్రకాష్, ముదిరాజ్ ఫైనాన్స్ కార్పోరేషన్ చైర్మన్ బుర్ర జ్ఞానేశ్వర్‌కు స్వాగతం పలికారు. సంఘం నాయకులు బల్ల సత్తయ్య, నిజ్జన రమేష్, బి.విఠల్, నాగరాజు తదితరులున్నారు.
ఎమ్మెల్సీ కోటా నుంచి ముదిరాజ్‌లకు రూ. 10 లక్షలు మంజూరు
మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్
పర్మళ్ల పెద్దమ్మ ఆలయంలో
ప్రత్యేక పూజలు