
చివరి దశకు ధాన్యం సేకరణ
నిజాంసాగర్: యాసంగి సీజన్‌కు సంబంధించిన వ రిధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకుంటున్నా యి. 317 కేంద్రాలలో కాంటాలు పూర్తయ్యాయి. మరో 129 కేంద్రాలు కొనసాగుతున్నాయి.
జిల్లాలో ధాన్యం సేకరణ కోసం 446 కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఇప్పటివరకు 66,788 మంది రైతులనుంచి రూ. 815 కోట్ల విలువైన 3.51 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించారు. ధాన్యం విక్రయించిన రైతు లకు ఆన్‌లైన్ ద్వారా బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేస్తున్నారు. ఇప్పటివరకు రూ. 766 కోట్లను రైతులకు అందించినట్లు అధికారులు తెలిపారు.
తూకాలు పూర్తి కావడంతో పలు కేంద్రాలను మూసి వేశారు. ప్రస్తుతం 129 కేంద్రాల్లో కాంటాలు కొనసాగుతున్నాయి. మహమ్మద్‌నగర్, నిజాంసాగ ర్, పిట్లం, బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పెద్దకొ డప్‌గల్, డోంగ్లి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, నాగిరెడ్డిపేట తదితర మండలాల్లో వరిధాన్యం కొనుగోళ్లు పూర్తికాలేదు.
బోనస్ కోసం..
జిల్లాలోని ఆయా కొనుగోలు కేంద్రాల్లో 24,570 మంది రైతులు సన్నరకాలను విక్రయించారు. వీరికి బోనస్ కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 1.61 లక్షల మెట్రిక్ టన్నుల మేర సన్న రకం ధాన్యం రాగా.. వాటికి సంబంధించి రైతులకు రూ. 80 కోట్ల బోనస్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 3.54 మెట్రిక్
టన్నుల కొనుగోళ్లు
129 కేంద్రాల్లో
కొనసాగుతున్న తూకాలు