
వానొచ్చే.. కల్యాణ వేదిక మారే!
పాఠశాల ఆవరణలో నిలిచిన వర్షం నీరు
నాగిరెడ్డిపేట: భారీ వర్షం కారణంగా పోచారంలో వివాహ వేదిక మారింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన యాదయ్య తన కూతురు వివాహాన్ని బుధవారం జరిపించేందుకు గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాట్లు చేసుకున్నాడు. కాగా మంగళవారం రాత్రి కురిసిన వర్షంతో పాఠశాల ఆవరణలో నీరునిండి చెరువులా మారింది. ఆ నీటిని తొలగించే పరిస్థితి లేకపోవడంతో కల్యాణ వేదికను బంజర గ్రామ సమీపంలోని ఫంక్షన్ హాల్‌కు మార్చాడు. వేదిక మారిన విషయాన్ని యాదయ్య కుటుంబ సభ్యులు సోషల్ మీడియా ద్వారా బంధుమిత్రులకు తెలియజేశారు.