
బిచ్కుందలో జర్నలిస్టుల నిరసన
● ఏపీలో కూటమి ప్రభుత్వం
కళ్లు తెరిపించాలని..
● అంబేడ్కర్ విగ్రహానికి
వినతి పత్రం అందజేత
బిచ్కుంద(జుక్కల్): ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కూటమి ప్రభుత్వం పత్రిక స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తుందని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షి దినపత్రిక ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపినందుకు ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డి ఇంటిపై పొలీసులతో సోదాలు చేయించి వేధింపులకు గురిచేయడం బాధకరమన్నారు. ఈవిషయంలో ఏపీ పొలీసుల తీరును నిరసిస్తూ ఆదివారం బి చ్కుందలో వర్కింగ్ జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడు తూ కూటమి ప్రభుత్వానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ కళ్లు తెరపించాలని కోరుతూ ఆయన విగ్రహానికి వినతి పత్రం అందించామన్నారు. కార్య క్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా సహాయక కార్య దర్శి జీ. వీరయ్య, జర్నలిస్టులు శంకర్ పటేల్, సంజీవ్, డీ శ్రీనివాస్, నాగరాజ్, విజయ్‌కుమార్, లక్ష్మణ్, బీ.విఠల్, సుభాష్ జాదవ్, ప్రవీణ్, మోహపిన్, సుభాష్, అబ్దుల్ గఫార్ పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో
వ్యక్తి మృతి
లింగంపేట(ఎల్లారెడ్డి): కూలీ పనులు చేయడానికి వచ్చిన ఓ వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు ఎస్సై వెంకట్రావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంకు చెందిన అంతోటి ఉపేంద్ర(47) భవన నిర్మాణ పనులు చేయడానికి కొన్ని రోజుల క్రితం లింగంపేట మండల కేంద్రానికి వచ్చాడు. వెంకటేశ్వర్‌రావు మేసీ్త్ర వద్ద అతడు కూలీ పనులు చేస్తుండేవాడు. ఆదివారం ఉదయం అతడు అనుమానాస్పదస్థితిలో మృతిచెంది ఉన్నాడు. మేసీ్త్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. రఘునాథపాలెంలోని మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ
యాక్ట్ కేసు నమోదు
నిజామాబాద్‌రూరల్: మండలంలోని తిర్మన్‌పల్లి గ్రామంలో ఆదివారం ముగ్గురు వ్యక్తులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసు నమోదు అయినట్లు రూ రల్ ఎస్‌హెచ్‌వో మహ్మద్‌ఆరీఫ్ తెలిపారు. వివ రాలు ఇలా.. తిర్మన్‌పల్లి గ్రామంలో బోనాలపండుగ నిర్వహిస్తున్న సందర్భంగా గ్రామంలో ఉ న్న ఎస్టీలకు ఇతర ప్రజలకు మాటమాట పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తి ర్మన్‌పల్లి గ్రామస్తుల ఎస్సీ, ఎస్టీ వర్గాల ఫిర్యా దు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.