
‘లూపస్’పై అవగాహన అవసరం
నిజామాబాద్‌లో 2కే రన్
నిజామాబాద్ నాగారం: శరీరంలోని అన్ని భాగాల ను ప్రభావితం చేసే ‘లూపస్’ వ్యాధిపై ప్రజలు అ వగాహన పెంచుకోవాలని వైద్యులు సూచించారు. ప్రపంచ లూపస్ దినోత్సవం సందర్భంగా శనివా రం ఐఎంఏ, నిజామాబాద్ రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వ హించారు. వినాయక్‌నగర్‌లోని హనుమాన్ జంక్షన్ నుంచి రుమటాలజీ అండ్ ఆర్థరైటిస్ సెంట ర్ వర కు రన్ కొనసాగింది. అనంతరం చర్మవ్యాధి నిపు ణురాలు గ్రీష్మ మాట్లాడుతూ లూపస్ వ్యాధి కళ్లు, మెదడు,ఊపిరితిత్తులు,మూత్రపిండాలు,రక్త నాళా లు తదితర ఏ భాగాన్ని అయినా ప్రభా వితం చే స్తుందన్నారు.ఐఎంఏ అధ్యక్షుడు డా అజ్జ శ్రీనివాస్, కోశాధికారి డా. రాజేందర్ మాట్లాడుతూ లూపస్ వ్యాధి నివారణకు రుమటాలజిస్టును సంప్రదించి సూచించిన మందులు వాడాలన్నారు. డాక్టర్ జీ రవి కిరణ్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, మంచినిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం తదితర మంచి జీవనశైలిని అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు జీవన్ రావు , శ్రీశైలం, పీబీ కృష్ణమూర్తి ఉన్నారు.