
ఇటుక బట్టిని తొలగించాలని ఫిర్యాదు
బాన్సువాడ రూరల్: మండలంలోని సోమేశ్వర్ శివారులో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఓ ఇటుకబట్టీని తొలగించాలని కోరుతూ శనివారం సోమేశ్వర్ గ్రామస్తులు బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఇటుకబట్టీలతో తమ గ్రామంలోకి ప్రతిరోజు పొగ, దుమ్ముధూళి చేరుతుండటంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. ఇటుకబట్టీ ద్వారా వెలువడే పొగ, డస్టు వల్ల చుట్టూపక్కల పొలాలకు నష్టం వాటిల్లుతోందని ఆరోపించారు.
తాడ్వాయిలో వాహనాల తనిఖీ
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలోని కామారెడ్డి –ఎల్లారెడ్డి ప్రధాన రహదారిలో శనివారం పోలీసుల వాహనాలను తనిఖీ చేపట్టా రు.వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ ప త్రాలలేనివారితో పాటు,హెల్మెట్ ధరించని ప లువురికి జరిమానా విధించారు. పోలీసు సిబ్బంది,హోంగార్డులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
● డీఎస్పీ విఠల్ రెడ్డి
నస్రుల్లాబాద్(బాన్సువాడ): పోలీసులు విధు ల్లో అప్రమత్తంగా ఉండాలని బాన్సువాడ డీఎ స్పీ విఠల్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ డయల్ 100కు ఫిర్యాదు వచ్చిన వెంటనే పోలీసులు స్పందించాలన్నారు. సైబర్ క్రైంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట పీఎస్సై అరుణ్ కుమార్, సిబ్బంది శ్రీనివాస్, రాము, సరిత తదితరులు ఉన్నారు.
చోరీల నేపథ్యంలో
జాగ్రత్తగా ఉండాలి
మాచారెడ్డి : చోరీలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో మాచారెడ్డి, పాల్వంచ మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాచారెడ్డి ఎస్సై అనిల్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.బయట నిద్రించవద్దని, అనుమానితు లు కనబడితే పోలీసులకు సమాచారం ఇ వ్వా లని కోరారు. ఊరికి వెళ్లేటపుడు విలువైన వస్తు వులు, ఆభరణాలు, డబ్బులు ఇంట్లో ఉంచవద్ద ని సూచించారు.జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఇటుక బట్టిని తొలగించాలని ఫిర్యాదు