
రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కామారెడ్డి విద్యార
సాక్షి ప్రతినిధి, కా మారెడ్డి : స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌గా నియమితులై న ఐఎఫ్‌ఎస్ అధికా రి డాక్టర్ జి.చంద్రశేఖర్‌రెడ్డి కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సై న్స్ కళాశాల పూర్వ విద్యార్థి. ఆయన 1982 –85 లో ఇక్కడ బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సు చదివారు. కళాశాల అలుమ్నికి పలుమార్లు హాజరయ్యారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోర్గావ్ గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి.. అప్పట్లో కామారెడ్డిలో స్నేహితులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ బీఎస్సీ ఫారెస్ట్రీ పూర్తి చేశారు. కామారెడ్డిలో ఆయనకు చాలామంది మిత్రులున్నారు. డిగ్రీ పూర్తయ్యాక ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి లైఫ్ సైన్సెస్‌లో పీజీ చేశారు. 1991లో ఐఎఫ్‌ఎస్ అధికారిగా ఎంపికై వివిధ ప్రాంతాల్లో పనిచేశారు.
‘కొలతల ప్రకారం
నిర్మించుకోవాలి’
నిజాంసాగర్: కొలతల ప్రకారంగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుంటేనే బిల్లులు వస్తాయని జెడ్పీ సీఈవో చందర్ నాయక్ పేర్కొన్నారు. మంగళవారం జుక్కల్ మండల కేంద్రంతో పాటు బంగారుపల్లె గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. ఇంటి నిర్మాణాలు ప్రారంభించిన వారికి విడతల వారీగా బిల్లులు వస్తాయన్నారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి సుధాకర్ తదితరులున్నారు.
వినియోగదారుల ఫోరం జిల్లా
ప్రతినిధుల నియామకం
కామారెడ్డి అర్బన్ : వినియోగదారుల ఫోరం జిల్లా కార్యవర్గంలో పలువురికి అవకాశం క ల్పించినట్లు ఫోరం జిల్లా అధ్యక్షుడు కుసుమ రమేష్ తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా కుంట నర్సింలు, ప్రధాన కార్యదర్శిగా ఉప్పు నూతల రమేష్‌గౌడ్, కార్యదర్శిగా బొల్లి రా జు, సంయుక్త కార్యదర్శిగా బాబు గౌడ్, రా జేశ్ ఖన్నాలను నియమించినట్టు పేర్కొన్నా రు. త్వరలోనే ఫోరం ప్రతినిధులకు అవగా హన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
కొనుగోళ్లలో
వేగం పెంచాలి
తాడ్వాయి : ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని జిల్లా సహకార శాఖ అధికారి రామ్మోహన్, మానిటరింగ్ అధికారి సాయిలు సూ చించారు. బ్రాహ్మణపల్లిలోని వరికొనుగోలు కేంద్రాన్ని మంగళవారం వారు తనిఖీ చేశా రు. రైతులకు ఇబ్బంది కలుగకుండా ఎప్పటికప్పుడు ధాన్యాన్ని తూకం వేసి, రైస్‌మిల్లుల కు తరలించాలని సూచించారు. టార్పాలిన్‌లను అందుబాటులో ఉంచాలన్నారు. వడ్లు అమ్మిన రైతులకు త్వరగా డబ్బులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారి వెంట సొ సైటీ డైరెక్టర్ నర్సింలు, కార్యదర్శి నర్సింలు, ఏఈవో హారిక తదితరులున్నారు.
‘ఉత్తీర్ణులయ్యేలా చూడాలి’
గాంధారి : విద్యార్థులందరూ పాస్ అయ్యే లా చూడాలని ఇంటర్మీడియట్ నోడల్ ఆఫీ సర్ షేక్ సలాం సూచించారు. ఇంటర్‌లో ఫె యిలైన విద్యార్థుల కోసం గాంధారి కళాశాల లో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను మంగళవారం తనిఖీ చేశారు. ప్రిన్సిపాల్ గడ్డం గంగారాం, అధ్యాపకులతో సమావేశమై సబ్జెక్టులవారీగా వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించా రు. వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించిన అఫిలి యేషన్ ప్రతిపాదనలు పంపాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు రాజగోపాల్, లక్ష్మణ్, విజయకుమార్, రమేష్, వెంకటస్వామి, స్వప్న, మమత తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కామారెడ్డి విద్యార

రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కామారెడ్డి విద్యార

రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కామారెడ్డి విద్యార

రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కామారెడ్డి విద్యార