మోపాల్: మండలంలోని చిన్నాపూర్ శివారులో మూల మలుపు వద్ద బుధవారం ఉదయం టిప్పర్, పాఠశాల బస్సు ఢీకొన్నాయి. గ్రామస్తులు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. నగరంలోని ఓ పాఠశా లకు చెందిన బస్సు విద్యార్థులను తీసుకెళ్లేందుకు వస్తుండగా, అదే సమయంలో చిన్నాపూర్ నుంచి బాడ్సి వైపు టిప్పర్ వెళ్తుంది. మూలమలుపు వద్ద నెమ్మదిగా వెళ్తున్నప్పటికీ.. రోడ్డు చిన్నగా ఉండటంతో టిప్పర్ అదుపు తప్పి పాఠశాల బస్సు ముందుభాగంలో ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బ స్సులో 8మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వాహనాలు వేగంగా లేకపోవడంతో ప్రమాదం తప్పిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. విద్యార్థులను వేరే బస్సులో పాఠశాలకు పంపించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్సై మహేష్ చెప్పారు. ఘటనా స్థలిని పరిశీలించామన్నారు. ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదన్నారు.