
తెయూ(డిచ్‌పల్లి) : ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కిక్ బాక్సింగ్ ఉమెన్స్ టోర్నీ –2023లో ఉత్తమ ప్రతిభ కనబర్చి రజత పథకం సాధించిన పవార్ ఉమను మంగళవారం తెయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్, ఇన్‌చార్జి రిజిస్ట్రార్ ప్రొ ఫెసర్ విద్యావర్థిని ఘనంగా సన్మానించారు. ప్రస్తుతం ఉమ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ సెకండ్ ఇయర్ చదువుతోంది. కార్యక్రమంలో వర్సిటీ స్పోర్ట్స్ ఇంచార్జీ సంపత్, ఉమ కోచ్ పీ.శ్రీనివాస్, గిరిరాజ్ కళాశాల పీడీ బి బాలమణి, వర్సిటి ఫిజికల్ డైరక్టర్ బీఆర్ నేత, కిక్‌బాక్సింగ్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
మైనారిటీ
యువతకు శిక్షణ
నిజామాబాద్ నాగారం : జిల్లాలో ఉన్న మైనారిటీ యువతకు న్యాక్ ద్వారా కన్‌స్ట్రక్షన్ విభాగంలో ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ ప్రభాకర్ తెలిపారు. మంగళవారం నగరంలోని ఐటీఐ ఆవరణలో ఉన్న న్యాక్ శిక్షణ కేంద్రంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. 3 నెలల పాటు కన్‌స్ట్రక్షన్ విభాగంలో సూపర్‌వైజర్ పోస్టు కోసం శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ అనంతరం దేశ, విదేశాల్లో ఉద్యోగ అవకాశాలుంటాయన్నారు. మైనార్టీ యువతకు శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగులను తీసుకురావడంతో కృషి చేసినందుకు సయ్యద్‌కై సర్‌ను ప్రత్యేకంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో న్యాక్ ఇన్‌స్ట్రక్టర్ సరోజ, జమాతే ఇస్లామి ప్రతినిధి షేక్‌హుస్సేన్, అబ్దుల్ అలీం, మైనారిటీ యువత తదితరులు పాల్గొన్నారు.
ప్రతిభకు పురస్కారం
కామారెడ్డి రూరల్: సౌత్ ఇండియా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ఇస్రో నుంచి జాతీయస్థాయి ప్రతిభా పురస్కారం పొందిన చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు విజయగిరి రామకష్ణను గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలోకామారెడ్డి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గట్టగోని గోపిగౌడ్, మాజీ సర్పంచ్ రామా గౌడ్, ఎంపీటీసీలు నీలమ్మ రాజు, కమ్మరి అ నంతలక్ష్మీ శ్రీనివాస్, పీఏసీఎస్ డైరెక్టర్ కమ్మరి లక్ష్మీనారాయణ, ప్రధానోపాధ్యాయు డు శ్రీనివాస్, బీఆర్‌ఎస్ మండల యూత్ అధ్యక్షుడు అనిల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

