చలమలశెట్టి సునీల్‌కు పరామర్శ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పితృ వియోగంతో బాధపడుతున్న ప్రముఖ వ్యాపార వేత్త, గ్రీన్‌కో యాజమాన్య ప్రతినిధి చలమలశెట్టి సునీల్‌ను గురువారం మచిలీపట్నంలో మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పలకరించారు. సునీల్‌తోపాటు సోదరులైన అనిల్‌కుమార్, వెంకటేశ్వరరావులను పరామర్శించి, డాక్టర్ సురేంద్రనాథ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సునీల్ తండ్రి సురేంద్రనాథ్ వైద్యుడిగా అందించిన సేవలు వెలకట్టలేనివని రాజా పేర్కొన్నారు. రాజా వెంట పార్టీ ప్రత్తిపాడు కో–ఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి జమీలు, మాదిరెడ్డి దొరబాబు ఉన్నారు.


