ఆదివారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2025
పాలు పోసుకునే స్థితిలో పంట పాడైంది
పెద్దాపురం మండలం కాండ్రకోటకు చెందిన కొనగళ్ల వెంకటేశ్వర్లు సన్నకారు రైతు. తాతలు ఇచ్చిన భూమి సాగు చేసుకుంటున్నారు. రెండెకరాల్లో రూ.60 వేలు పెట్టుబడి పెట్టి వరి సా గు చేశారు. చేను కోతకు వచ్చే సమయంలో మోంథా తుపాను ముంచేసిందని ఆవేదన చెందుతున్నారు. భూ మిపై ఆధారపడి జీవించే రైతును ప్రభుత్వం ఆదుకుంటుందా లేదా అనే అయోమయ స్థితిలో వెంకటేశ్వర్లు కుటుంబం ఉంది. పడిపోయిన చేనును నిలబెట్టడానికి ఎకరాకు రూ.10 వేల అదనపు ఖర్చవుతుందని చెప్పారు. చేను పడిపోవడంతో ఎకరాకు 10 బస్తాల వరకూ దిగుబడి తగ్గిపోతుందని ఆయన ఆవేదన చెందుతున్నారు.
పెట్టుబడి కూడా దక్కేలా లేదు
కాజులూరు మండలం మొగలిపాలేనికి చెందిన ఈ కౌలు రైతు పేరు నల్లమిల్లి ఆదిరెడ్డి. వ్యవసాయ కూలీగా పొట్ట పోసుకుంటూనే గ్రామంలోని ఓ రైతు వద్ద రెండెకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. ఎరువుల షాపుల వద్ద, షావుకారుల వద్ద అప్పులు చేసి మరీ ఇప్పటి వరకూ ఎకరాకు రూ.25 వేల చొప్పున పెట్టుబడి పెట్టారు. ఏపుగా పెరిగిన పంటను చూసి ఎకరాకు 30 నుంచి 40 బస్తాల దిగుబడి వస్తుందని ఆశ పడ్డారు. ఇంతలోనే ఆయన ఆశలపై తుపాను నీళ్లు జల్లేసింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు పంట నేలనంటేయడంతో ఇప్పుడు 20 బస్తాలకు మించి దిగుబడి వచ్చే పరిస్థితి లేదని ఆదిరెడ్డి ఆవేదనగా చెప్పారు. మరోవైపు పడిపోయిన పంటను నిలబెట్టి కోత కోసి, మాసూళ్లు చేసి, గింజ ఒడ్డుకు చేర్చడానికి మరో రూ.15 వేలు ఖర్చవుతుందని, పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, రైతుకు కౌలు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదని ఆయన వాపోతున్నారు.
నిర్లక్ష్యమే ముంచుతోంది
పిఠాపురం మండలం రాపర్తికి చెందిన మోరుకుర్తి సూరిబాబు కౌలుకు ఐదెకరాల్లో సాగు చేస్తున్నారు. గత ఏడాది వచ్చిన ఏలేరు వరదల్లో ఈయన పొలం పక్కనే ఎకరం పొడవునా గండి పడింది. దానిని పూడ్చాలని అధికారులకు ఎన్నోసార్లు మొర పెట్టుకున్నారు. గండ్లు పూడ్చుతున్నట్లు యంత్రాలతో హడావుడి చేశారు. కేవలం గట్టుపై నడిచి వెళ్లేలా చేశారు తప్ప ఎక్కడా పటిష్టంగా పూడ్చలేదు. ఇప్పుడు మళ్లీ ఏలేరు నుంచి అదనపు జలాలు వదిలేస్తూండటంతో మళ్లీ గండి పడే పరిస్థితి వచ్చింది. గత్యంతరం లేక ఇక్కడి రైతులందరూ కలసి ఇసుక బస్తాలు వేసి, గండి పడకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలాచోట్ల గండ్లు పడ్డాయి. ఇక్కడ కూడా పడే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే తమ పంటలు తమకు దక్కే అవకాశం ఉండదని సూరిబాబు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వచ్చి అధికారులు, నేతలు వచ్చి అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నారని, పంటలు పోయాక చేసేదేమీ ఉండదని ఆయన వాపోతున్నారు.
ఆదివారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2025
ఆదివారం శ్రీ 2 శ్రీ నవంబర్ శ్రీ 2025


