సంప్రదాయాలపై అవగాహన అవసరం | - | Sakshi
Sakshi News home page

సంప్రదాయాలపై అవగాహన అవసరం

Oct 15 2025 6:02 AM | Updated on Oct 15 2025 6:02 AM

సంప్ర

సంప్రదాయాలపై అవగాహన అవసరం

నన్నయ వీసీ ఆచార్య ప్రసన్న శ్రీ

వర్సిటీలో ఘనంగా యువజనోత్సవాలు

రాజానగరం: చదువుతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంచుకోవాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జాతీయ యువజనోత్సవాలలో భాగంగా జిల్లా యువజన సర్వీసుల శాఖ, సెట్రాజ్‌ (కాకినాడ) ఆధ్వర్యంలో ఆదికవి నన్నయ యూనివర్సిటీలోని కన్వెన్షన్‌ సెంటర్‌లో మంగళవారం యువజనోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సర్వీసుల శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ఎస్‌వీడీఎస్‌ రామకృష్ణ మాట్లాడుతూ యువతలోని ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహ దపడతాయన్నారు. ఈ సందర్భంగా 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వయసున్న 944 మంది విద్యార్థులు జానపద నృత్యం, జానపద గేయాలు, స్టోరీ రైటింగ్‌, పోస్టర్‌, ఫొటోగ్రఫీ, ఉపన్యాసం, పర్యావరణ పరిరక్షణ మున్నగు వాటిలో పోటీ పడ్డారు.

విజేతలు వీరే..

● ఇన్నోవేషన్‌ ట్రాక్‌ (సైన్స్‌ మేళా ప్రదర్శన)లో వంగ అయ్యప్ప గ్రూప్‌ ప్రథమ, షేక్‌ మోనినా గ్రూప్‌ ద్వితీయ, జానపద నృత్యం (గ్రూప్‌)లో ఎస్‌ఆర్‌ఎస్‌ గ్రూప్‌ ప్రథమ, వై.జానీ ఏంజెల్‌ గ్రూప్‌ ద్వితీయ, పి.డోలా స్రవంతి గ్రూప్‌ తృతీయ స్థానాల్లో నిలిచాయి.

● జానపద గేయాల విభాగంలో తాతరాజు గ్రూప్‌ ప్రథమ, ఎ.మొలరాజు గ్రూప్‌ ద్వితీయ, వై.జానీ ఏంజెల్‌ గ్రూప్‌ తృతీయ స్థానాలు సాధించాయి.

● ఉపన్యాసంలో విధూషీ శాండిల్య ప్రథమ, జి.ధ్రువిత్‌ ద్వితీయ, వైష్టవి కొల్లిమల్ల తృతీయ, కథ రాయడంలో వీబీ జ్ఞాన షర్మిల ప్రథమమ, అపూర్వ కొచ్చే ద్వితీయ, ఎ.లాలస్య తృతీయ బహుమతులు సాధించారు.

● పెయింటింగ్‌లో మహ్మద్‌ సమీర్‌, డి.వెంకట త్రివిక్రమ్‌, కె.లాజర్‌ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. కవిత్వంలో జి.ధ్రువిత్‌ ప్రథమ, బోడా హాసిని ద్వితీయ స్థానాలు సాధించారు. ప్రథమ స్థానంలో నిలిచిన విజేతలు రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని సెట్రాజ్‌ సీఈఓ కాశీ విశ్వేశ్వరరావు తెలిపారు.

సంప్రదాయాలపై అవగాహన అవసరం 1
1/1

సంప్రదాయాలపై అవగాహన అవసరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement