
నకిలీపై సమరం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: మద్యపాన వ్యసనానికి ప్రజలను దూరం చేసి, వారి ఆరోగ్యాన్ని, తద్వారా సమాజంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ, ఫుల్ కిక్ ఇచ్చే మద్యాన్ని అందిస్తామంటూ గత సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కో మందుబాబులకు వల వేశారు. వారి బలహీనతతో ఆటాడుకుని, ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చారు. అప్పటి వరకూ ప్రభుత్వ ఆ ధీనంలో ఉన్న మద్యం షాపులను కూటమి నేతలకు కట్టబెట్టారు. తద్వారా వారికి ‘సంపద సృష్టించారు.’ అధిక ధరలకు మద్యం అమ్మకాలు మొదలుపెట్టి ఎడాపెడా దోచుకోవడం మొదలెట్టారు.. వీధివీధినా బెల్టు షాపులు తెరచి, మద్యం ఏరులై పారిస్తున్నారు. డోర్ డెలివరీ సైతం ఇస్తున్నారు. ఇది చాలదన్నట్టు టీడీపీ నేతలు విచ్చలవిడిగా నకిలీ మద్యం సరఫరా చేస్తూ మందుబాబుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రజలకు చేటుగా పరిణమించిన ఈ నకిలీ మద్యం, బెల్టు షాపులకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ సోమవారం పోరుబాట పట్టింది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమాల్లో.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానను సైతం లెక్క చేయకుండా.. ప్రజలు పెద్ద సంఖ్యలో కదం తొక్కారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టాలని, బెల్టు షాపులను ఎత్తివేయాలని, మద్యం అమ్మకాలకు నిర్దేశిత సమయాలు పాటించాలని, నకిలీ మద్యం కుంభకోణంపై సిట్‌తో కాకుండా సీబీఐ విచారణ జరిపించాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. తుని, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో ఎకై ్సజ్ కార్యాలయాల వరకూ భారీ ప్రదర్శనలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.
‘రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమగా మార్చి టీడీపీ నాయకులు వేల కోట్లు దిగమింగారు. ఇప్పటి వరకూ బెల్టు షాపులకు పరిమితమైన నేతలు ఇప్పుడు నకిలీ మద్యం ఏరులై పారిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మద్యంపై సీబీఎన్ (చంద్రబాబు నాయుడు) సిట్‌తో కాకుండా సీబీఐ విచారణ జరిపించాలి’ అని వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలివచ్చి, స్థానిక ఎకై ్సజ్ శాఖ ఉప కమిషనర్ (డీసీ) కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారు. కార్యాయల సిబ్బంది ఎంతకూ గేటు తెరవలేదు. దీంతో, నకిలీ మద్యం, బెల్టు షాపులకు వ్యతిరేకంగా వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని నాయకులు చెప్పడంతో ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి.రేణుక బయటకు వచ్చారు. ఆమెకు కన్నబాబు వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకూ మద్యం విచ్చలవిడిగా విక్రయాలు, అధిక రేట్లు, బెల్టు షాపుల గురించి మాత్రమే చూశామని.. ఇప్పుడు ఏకంగా నకిలీ మద్యం ద్వారా వేల కోట్లు దిగమింగారని ఆరోపించారు. నకిలీ మద్యం కోసం స్పిరిట్ నుంచి లేబుళ్ల వరకూ వారే పెట్టేశారని, 15 నెలల నుంచి జరుగుతున్నా ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. తెలియకపోతే చేతకానితనమని, తెలిస్తే పార్టనర్‌షిప్‌గా భావించాల్సి వస్తుందని, రెండింటిలో ఏదో ఒకటి చెప్పాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పి నకిలీ ‘ఎన్’ బ్రాండ్‌లు ఇస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో మద్యం మరణాలు 421 ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయన్నారు. నకిలీ మద్యంపై వార్తలు రాస్తున్న ‘సాక్షి’పై కక్ష కట్టి గొంతు నొక్కాలని ఎడిటర్, విలేకర్లపై కేసులు పెట్టడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాక్షి’పై కేసులు ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు అని, ఇదేవిధంగా కక్ష కడితే చంద్రబాబుకు కొమ్ము కాస్తున్న పచ్చ పత్రికలు కనిపించవని, ఇది సోషల్ మీడియా యుగమనే విషయం గుర్తుంచుకోవాలని కన్నబాబు అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీశివకుమారి, పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు ఒమ్మి రఘురామ్, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, పార్టీ ఎస్‌ఈసీ సభ్యులు బెజవాడ సత్యనారాయణ, గోపుశెట్టి బాబ్జీ, సరోజ, మాకినీడి శేషుకుమారి, మైనార్టీ సెల్ నేత కరీం బాషా, పి.నాగబాబు, కొప్పిశెట్టి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడొద్దు
విచ్చలవిడిగా సాగుతున్న నకిలీ మద్యం తయారీ, విక్రయాలపై సీబీఐ విచారణ చేపట్టాలి. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా నాణ్యమైన మద్యం తక్కువ ధరకే సరఫరా చేస్తామని ఎన్నికల ముందు కూటమి నాయకులు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం అక్రమ కేసులు పెడుతూ నాయకులను ప్రభుత్వం వేధిస్తోంది. మద్యం దుకాణాలను కూటమి నేతలు తమ అనుచరులకు అప్పగించారు. నకిలీ మద్యం తాగిన వ్యక్తులు నాలుగైదు రోజుల్లో జవసత్వాలు కోల్పోతున్నారు. నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకత వస్తున్నప్పటికీ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. చేతులు దులుపుకొనేందుకే చంద్రబాబు సిట్, సీఐడీ విచారణ అంటున్నారు. వేల కోట్ల రూపాయల స్కాములు చేసిన చంద్రబాబు, లోకేష్‌లు ఇకనైనా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడకుండా నాణ్యమైన మద్యం అందించాలి.
– దాడిశెట్టి రాజా,
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
‘ఎన్’ బ్రాండ్ నకిలీ మద్యం
కూటమి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని పాలన సాగిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్థావరాలు ఏర్పాటు చేసుకుని నకిలీ మద్యం తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మద్యం షాపులను నిబంధన మేరకే నిర్వహించారు. నేడు కూటమి సర్కారు వేలాదిగా బెల్టు షాపులు తెరచి ‘ఎన్’ బ్రాండ్ నకిలీ మద్యం విక్రయిస్తోంది. దీనిని తాగిన మందుబాబులు మృత్యువాత పడుతున్నారు. నకిలీ మద్యం నిందితులు పట్టుబడుతున్నా ఎక్కడ బెల్టు షాపు కానీ, మద్యం దుకాణం కానీ సీజ్ చేయలేదు.
– వంగా గీతా విశ్వనాథ్, వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
సీబీఎన్ సిట్ కాదు.. సీబీఐ విచారణ కావాలి
నకిలీ మద్యానికి వ్యతిరేకంగా కదం తొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
సీబీఐ విచారణ జరపాలని డిమాండ్
ఎకై ్సజ్ కార్యాలయాల వద్ద నిరసన
వర్షాన్ని సైతం లెక్క చేయకుండా
ఆందోళన
తుని
తుని రైల్వే బ్రిడ్జి నుంచి పట్టణంలోని ప్రొహిబిషన్, ఎకై ్సజ్ స్టేషన్ ఎదుట నాయకులు, కార్యకర్తలతో కలసి భారీ ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యాన వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు ఈ ర్యాలీలో కదం తొక్కారు. కూటమి సర్కార్ మద్యం విధానానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ పట్టాభి చౌదరికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు యనమల కృష్ణుడు, రాయి మేరీ అవినాష్, కోరుమిల్లి లలిత, నాగం దొరబాబు, సకురు నాగేంద్ర నెహ్రూ, రేలంగి రమణగౌడ్, పోతల రమణ తదితరులు పాల్గొన్నారు.

నకిలీపై సమరం