
ఉప్పాడ తీరంలో కోతకు గురవుతున్న మత్స్యకారుల గృహాలు కోతకు
తీరంలో ‘అల’జడి
కోతకు గురవుతున్న మత్స్యకారుల ఇళ్లు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సోమవారం కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్ర అలలు ఎగసి పడుతున్నాయి. దీంతో సూరాడపేట, మాయాపట్న ం పాత మార్కెట్‌లోని మత్స్యకారుల ఇళ్లు కళ్ల ముందే కోతకు గురవుతున్నాయి. రాత్రికి రాత్రే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇళ్లతో పాటు రోడ్లు, విద్యుత్ స్తంభాలు, వృక్షాలు సైతం నెలకొరుగుతున్నాయి. రూ.లక్షలతో నిర్మించుకున్న ఇళ్లు రాకాసి అలల ధాటికి మొండి గోడలుగా మిగులుతుండటంతో మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. ప్రధాన రహదారులు చెరువులను తలపించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
– కొత్తపల్లి

ఉప్పాడ తీరంలో కోతకు గురవుతున్న మత్స్యకారుల గృహాలు కోతకు

ఉప్పాడ తీరంలో కోతకు గురవుతున్న మత్స్యకారుల గృహాలు కోతకు