
అధినేతతో జిల్లా నాయకులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ మంత్రి, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, పార్టీ నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు కలిశారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన పార్టీ సమీక్షా సమావేశాలలో పాల్గొన్న అనంతరం జగన్‌ను కలిసి కాకినాడ జిల్లాలో పలు అంశాలపై చర్చించారు.
సుప్రీంకోర్టు ప్రధాన
న్యాయమూర్తిపై దాడికి నిరసన
సామర్లకోట: అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్‌పై దాడి జరగడం దారుణమని పెద్దాపురం న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం పెద్దాపురంలో కోర్టు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. పెద్దాపురం బార్ అసోసియేషన్ పిలుపు మేరకు కోర్టు నుంచి వాకౌట్ చేసి కోర్టు ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు.
ఘనంగా ప్రత్యంగిర హోమం
అన్నవరం: రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి ఆశ్వీయుజ పౌర్ణిమ పర్వదినం సందర్భంగా మంగళవారం ప్రత్యంగిర హోమం ఘనంగా నిర్వహించారు. ఉదయం తొమ్మిది గంటలకు పండితులు వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ప్రత్యంగిర హోమం ప్రారంభించారు. హోమం అనంతరం ఘనంగా పూర్ణాహుతి నిర్వహించారు. తరువాత అమ్మవార్లకు వేద పండితులు నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు. అనంతరం అమ్మవారికి ప్రసాదాలు నివేదించి భక్తులకు పంపిణీ చేశారు. ప్రత్యంగిర హోమంలో 30 మంది భక్తులు రూ.750 చొప్పున టిక్కెట్లు కొనుగోలు చేసి పాల్గొన్నారు. రూ.22,500 ఆదాయం దేవస్థానానికి సమకూరింది. వేద పండితులు యనమండ్ర శర్మ, గంగాధరబట్ల గంగబాబు, ఆలయ పరిచారకులు చిట్టెం వాసు, వేణు, వ్రత పురోహితులు దేవులపల్లి ప్రకాష్, కూచుమంచి ప్రసాద్ ప్రత్యంగిర హోమం నిర్వహించారు.
కార్తిక మాస ఏర్పాట్లపై
నేడు సమావేశం
అన్నవరం: ఈ నెల 22 నుంచి నవంబర్ 20 వ తేదీ వరకు కొనసాగనున్న కార్తికమాసంలో అన్నవరం శ్రీవీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానానికి విచ్చేసే భక్తుల కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై బుధవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, దేవస్థానం అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 11 గంటల నుంచి ప్రకాష్‌సదన్ సత్రంలోని ట్రస్ట్ బోర్డు హాలులో చైర్మన్ ఐవీ రోహిత్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది.
విదేశాల్లో విద్య,
ఉద్యోగ అవకాశాలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన ఇన్‌చార్జి అధికారి వీ.డీ.జీ.మురళీ మంగళవారం తెలిపారు. ఖతర్ దేశంలో హోమ్‌కేర్ నర్స్, జర్మనీలో ఫిజియో థెరఫిస్ట్, ఆపరేషన్ థియేటర్ టెక్నిషియన్ ఉద్యోగాలకు, రష్యాలో మెటలర్జీ డిప్లొమా కోర్సులో అడ్మిషన్లు కల్పిస్తున్నామన్నారు. అర్హత, ఫీజు వివరాలు తదితర వాటికోసం 99888 53335 నంబర్‌లో సంప్రదించవచ్చని సూచించారు.

అధినేతతో జిల్లా నాయకులు

అధినేతతో జిల్లా నాయకులు