
నిరుద్యోగ సమస్య పరిష్కరించాలి
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నాయకులు జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు సోమవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి వై.బాబీ మాట్లాడుతూ, నామమాత్రంగా మెగా డీఎస్సీ పోస్టులు భర్తీ చేశారని, వివిధ ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షలకు పైగా ఖాళీగా ఉన్న పోస్టులను పక్కన పెట్టారని విమర్శించారు. ఎన్నికల ముందు ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం లేదా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తానంటూ కూటమి నేతలు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా ఆ ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని బాబీ డిమాండ్ చేశారు.